– అంతర్జాతీయ ప్లాస్టిక్ నివారణ దినోత్సవం లో పర్యావరణ.. పరిరక్షణకు ప్రతిజ్ఞ
– రాజనీతి శాస్త్ర నిపుణులు డాక్టర్ భట్టు విఠల్ ముదిరాజ్ పిలుపు
నవతెలంగాణ – కామారెడ్డి
“ప్రకృతికి జీవం పోదాం”- ప్లాస్టిక్ ను నిషేదిద్దాం నినాదంతో అంతర్జాతీయ ప్లాస్టిక్ నివారణ దినోత్సవం పర్యావరణ. పరిరక్షణ కు ప్రతిజ్ఞ చేద్దామని రాజనీతి శాస్త్ర నిపుణులు డాక్టర్ భట్టు విఠల్ ముదిరాజ్ పిలుపు ఇచ్చారు. అంతర్జాతీయ ప్లాస్టిక్ నివారణదినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం వివిధ విద్యాసంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, యువజన సంఘాలు కలిసి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఒక ప్రకటనలో ఆయన ప్రజలను కోరారు. సింగిల్ – యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా తగ్గించాలని, ప్రతి ఒక్కరూ ‘గోనే సంచులు, దారం, బట్టతో సంచులు, పేపర్ తో తయారు చేసిన సంచులు మరియు పర్యావరణ హితమైన వస్తువుల ను ఉపయోగించా లని ఆయన పిలుపు నిచ్చారు.
అంతర్జాతీయ ప్లాస్టిక్ ర్యాలీలు, పరిశుభ్రత కార్యక్రమాలు, మొక్కల నాటకం లాంటి కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల మానవాళికి కలిగే ముప్పు పై ప్రజలకు అవగాహన కల్పించడం గ్రామ స్థాయిలో ప్రజాప్రతినిధుల,ఉద్యోగుల బాధ్యతని ఆయన స్పష్టం చేశారు. ప్లాస్టిక్ తో ఏర్పడే,దుష్పరిణామాల వల్ల కలిగే నష్టాల పై మహిళా సంఘాలల్లో విస్తృతం గా చర్చలు జరపాలని సూచించారు. భవిష్యత్ తరాలకు, పర్యావరణనికి ఏర్పడే ముప్పు పై ప్రజలకు అవగాహన కల్పించిన్నప్పుడే “ప్లాస్టిక్-వ్యతిరేకోద్యమం” ప్రభుత్వాలు దిగివస్తాయని,ప్లాస్టిక్ ను నిషేధిస్తాయని పేర్కొన్నారు.
ప్రజా జీవనంలో గ్రామ పంచాయతీ లు,మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, ఎన్ని రకాలుగా ఉన్న మానవాళికి ముప్పు కలిగే వాటిపై నిర్దిష్టమైన చట్టాలు లేక సమర్ధవంతంగా అమలుకు నోచుకోక పోవడం వల్లనే పర్యావరణానికి ప్రమాదం రోజు.. రోజుకు,పెరుగుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు
ప్రపంచ వ్యాప్తంగా సాగుతున్న ప్లాస్టిక్
వ్యర్థాల,వ్యతిరేకోద్యమంలో ప్రతీ ఒక్కరు భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఏటా జరిగే సమావేశాలు, సదస్సులల్లో విద్యార్థులు, అధ్యాపకులు, ప్రజాప్రతినిధులు, పర్యావరణ ప్రేమికులు పాల్గొని విస్తృతంగా ప్రచారం చేయాలని కోరారు.
వ్యర్థాలను సేకరించే కార్మికులకు ఉపాధి
ప్లాస్టిక్ వ్యర్థాలను ఎక్కడపడితే అక్కడ వేయకుండా వేరు చేసి రీసైక్లింగ్ కు పంపించాలని సూచించారు. ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించే కార్మికులను కేంద్ర – రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించి వారికి ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు ప్లాస్టిక్ వ్యర్థాల సేకరణ పై నియంత్రణ,రీసైక్లింగ్ , మార్కెటింగ్ వ్యవస్థలను బలోపేతం చేయడానికి అవకాశాలు ఉన్నాయని అయన వివరించారు.
కాలుష్య రహిత సమాజం
భవిష్యత్ తరాలకు పరిశుభ్రమైన, కాలుష్య రహిత భూమిని,ప్రకృతిని అందించడం ప్రతీ పౌరుడి బాధ్యత అని డాక్టర్ భట్టు విఠల్ ముదిరాజ్ పేర్కొన్నారు. భవిష్యత్ తరాల కోసం సంపాదించే ఆస్తులు, సంపదలు, బంగారం, నిర్మానుష్యమైన భూములు, భవంతులు.. బంగ్లాలలు,నోట్ల కట్టలు కాదని రాజనీతి శాస్త్ర నిపుణులు డాక్టర్ భట్టు విఠల్ ముదిరాజ్ అన్నారు. స్వచ్ఛమైన గాలి నీరు, భూమి, అంతరిక్షం(ఆకాశం) దట్టమైన అడవులు, అటవీ జంతువులు, ఉన్నప్పుడే పర్యావరణ సమతుల్యత ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. మానవునికి సామాజిక న్యాయం జరిగి ఆయురారోగ్యాలతో,అష్టైశ్వర్యాలతో, సుఖసంతోషాలతో వందలాది,సంవత్సరాల పాటు మానవ మనుగడ జీవనo కోనసాగించవచ్చని ఆయన వివరించారు. “ప్లాస్టిక్ కు గుడ్ బై చెప్పుద్దాం – ప్రకృతికి జీవం పోదాం” అనే నినాదంతో గ్రామ గ్రామాన రకరకాల కార్యక్రమాలు నిర్వహించడoతో ప్రజల్లో చైతన్యం కలుగుతుందని ఆశాభావాన్ని ఆయన ఆ ప్రకటనలో వ్యక్తం చేశారు.



