Monday, July 20, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రామ్ ఫుట్‌వేర్ షాపును ప్రారంభించిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి 

రామ్ ఫుట్‌వేర్ షాపును ప్రారంభించిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి 

- Advertisement -

నవతెలంగాణ – కామారెడ్డి
కామారెడ్డి పట్టణంలోని సుభాష్ రోడ్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన రామ్ ఫుట్‌వేర్ షాపును టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా షాపు యజమానులకు శుభాకాంక్షలు తెలిపిన గడ్డం చంద్రశేఖర్ రెడ్డి, వ్యాపారంలో నిరంతరం అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. ప్రజలకు నాణ్యమైన పాదరక్షలను సరసమైన ధరలకు అందిస్తూ వినియోగదారుల విశ్వాసాన్ని సంపాదించాలని సూచించారు. “కస్టమర్ల సంతృప్తే వ్యాపార విజయానికి మూలం. నాణ్యమైన ఉత్పత్తులను అందుబాటు ధరల్లో అందించడం ద్వారా మంచి పేరు, గుర్తింపు పొందవచ్చు” అని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీ జనరల్ సెక్రటరీ నిమ్మ విజయకుమార్ రెడ్డి, జూలూరు సుధాకర్, మున్సిపల్ కౌన్సిలర్లు గడ్డమీది మహేష్, మాజీ కౌన్సిలర్లు పంపరి శ్రీనివాస్, జమీల్, చాట్ల వంశీ, పిడుగు సాయిబాబా, రంగ రమేష్ గౌడ్, యువ నాయకులు శశి, మున్ను అరుణ్, రాహుల్, చంద్రశేఖర్, ఆకాష్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -