Monday, July 20, 2026
E-PAPER
Homeజిల్లాలుకాంగ్రెస్ పార్టీ బలోపేతమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలి

కాంగ్రెస్ పార్టీ బలోపేతమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలి

- Advertisement -

మండల కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం

సర్ పై జరిగిన అవగాహన కార్యక్రమంలో చెరుకు శ్రీనివాస్ రెడ్డి

నవతెలంగాణ తొగుట

రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల ను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆదివారం మండల పార్టీ అధ్య క్షులు పంది రాజు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశానికి హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త అంకిత భావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లా లని సూచించారు. గ్రామ స్థాయి నుంచి పార్టీని మరింత పటిష్టం చేయడంలో కార్యకర్తల పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు. సర్ కార్యక్రమం లో దుబ్బాక నియోజకవర్గం 100 శాతం పూర్తి చేయడమే లక్ష్యంగా పని చేయాలని సూచించారు.

పార్టీ నియమించిన బీఎల్ఓలు పని చేయాలని ఈ నెల 30 లోపు పార్టీ శ్రేణులు క్రియాశీలకంగా పనిచేసి సర్ ను విజయవంతం చేయాలన్నారు. గ్రామాల్లో పార్టీ కార్యకలాపాలను మరింత విస్తరిం చాలని, ప్రజా సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిలుస్తుందని అన్నారు. మార్కె ట్ కమిటీ చైర్మన్ చెరుకు విజయ్ అమర్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు తెలియజేయాలన్నారు.

మండల పార్టీ అధ్యక్షులు పంది రాజు మాట్లాడుతూ మండలంలోని ప్రతి కార్యకర్త పార్టీ అభివృద్ధికి సమన్వయంతో పనిచేయాలని, పార్టీ నాయకత్వం సూచించిన కార్యక్రమాలను విజయవంతం చేయా లని కోరారు. ఈ సమావేశంలో ఆత్మ కమిటీ చైర్మన్ గాంధారి నరేందర్ రెడ్డి, జిల్లా జనరల్ సెక్రటరీ కూచి మహిపాల్ రెడ్డి, బ్లాక్ కో ఆర్డినేటర్ సోలిపేట ప్రసా ద్ రెడ్డి, సర్పంచ్ ల ఫోరం అధ్యక్షులు పిట్ల సత్త య్య, సర్పంచ్ లు, రాంపురం రమేష్, లచ్చొల్ల రవీందర్, గొడుగు జయమ్మ నర్సింలు, ఉప సర్పం చుల ఫోరం అధ్యక్షులు అమర్, ఉప సర్పంచ్ లు, గ్రామ పార్టీ అధ్యక్షులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతి నిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, ముఖ్య కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -