Monday, July 20, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్తొలి బోనం కార్యక్రమంలో పాల్గొన్న టీపీసీసీ ప్రధాన కార్యదర్శి

తొలి బోనం కార్యక్రమంలో పాల్గొన్న టీపీసీసీ ప్రధాన కార్యదర్శి

- Advertisement -

నవతెలంగాణ – కామారెడ్డి
కామారెడ్డి పట్టణంలో నిర్వహించిన తొలి బోనం కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి తన కుటుంబ సభ్యులు, కాలనీవాసులతో కలిసి భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి బోనం సమర్పించి ఆశీర్వాదాలు పొందారు. ఈ సందర్భంగా గడ్డం చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. బోనాల పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచిందన్నారు. ప్రతి ఒక్కరూ భక్తిశ్రద్ధలతో ఈ పండుగను జరుపుకోవడం ఆనందదాయకమని పేర్కొన్నారు. అమ్మవారి కటాక్షంతో రాష్ట్రంలో పాడిపంటలు సమృద్ధిగా పండాలని, రైతులు సుభిక్షంగా ఉండాలని, కామారెడ్డి పట్టణ ప్రజలందరూ సుఖశాంతులు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలతో జీవించాలని ప్రార్థించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియ, కుటుంబ సభ్యులు, కాలనీవాసులు, మహిళలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని బోనాల వేడుకలను ఘనంగా నిర్వహించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -