Tuesday, July 21, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గ్రామ అభివృద్ధికి ప్రత్యేక చొరవ

గ్రామ అభివృద్ధికి ప్రత్యేక చొరవ

- Advertisement -

• సర్పంచ్ ముద్దసాని పారిజాత సురేష్ 
• ఎలోని కుంట మరమ్మతు పనులు ప్రారంభం 
నవతెలంగాణ -పెద్దవంగర 
గ్రామ సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా ప్రత్యేక చొరవ చూపుతానని సర్పంచ్ ముద్దసాని పారిజాత సురేష్ అన్నారు. ఆదివారం పెద్దవంగర గ్రామంలోని ఎలోని కుంట కట్ట మరమ్మతు పనులను సర్పంచ్ ప్రారంభించి మాట్లాడారు. గ్రామంలో మౌలిక వసతుల కల్పన, తాగునీటి సౌకర్యం, సీసీ రోడ్లు, పారిశుద్ధ్యం, వీధి దీపాల ఏర్పాటు వంటి అభివృద్ధి పనులను చేపడుతున్నట్లు సర్పంచ్ తెలిపారు. ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. ఎలోని కుంట కట్ట మరమ్మతు పనులను త్వరితగతిన పూర్తి చేస్తామని తెలిపారు. ఎలోని కుంట కట్ట మరమ్మతు పనుల పట్ల ఆయకట్టు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా నాయకులు రవీందర్ రెడ్డి, ఉపసర్పంచ్ వినోద్, సీనియర్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి, లింగమూర్తి, రాములు, వార్డు సభ్యులు చిలుక సంపత్, చెరుకు యాకయ్య, నాయకులు సుంకరి జ్యోతి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -