Monday, July 20, 2026
E-PAPER
Homeఖమ్మంసోనమ్ వాంగ్‌చుక్ ఆమరణ దీక్షకు సీపీఐ(ఎం) సంఘీభావం 

సోనమ్ వాంగ్‌చుక్ ఆమరణ దీక్షకు సీపీఐ(ఎం) సంఘీభావం 

- Advertisement -

– కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి
– ప్లకార్డులతో అంబేద్కర్ విగ్రహం ఎదుట నిరసన 
నవతెలంగాణ-సత్తుపల్లి

నీట్ పరీక్ష పత్రాల లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని సీపీఐ(ఎం) జిల్లా నాయకులు మోరంపూడి పాండురంగారావు, జాజిరి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ప్రముఖ సామాజిక కార్యకర్త, విద్యావేత్త సోనమ్ వాంగ్‌చుక్ ఢిల్లీలో చేపట్టిన ఆమరణ దీక్షకు మద్దతు ప్రకటిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా కోరుతూ సీపీఐ(ఎం) శ్రేణులు ఆదివారం స్థానిక అంబేద్కర్ విగ్రహం ఎదుట ప్రకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పాండురంగారావు, శ్రీనివాస్ మాట్లాడారు. దేశ విద్యా వ్యవస్థలో పారదర్శకతను పునరుద్ధరించాలని కోరారు. 

నీట్ పరీక్ష పత్రాల లీకేజీతో లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. పరీక్షల నిర్వహణలో జరిగిన వైఫల్యాలకు కేంద్ర ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలని, విద్యను కార్పొరేట్ ప్రయోజనాలకు అనుగుణంగా మార్చే విధానాలను విరమించి, విద్యార్థులకు న్యాయం చేసే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

లడఖ్‌కు చెందిన సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్చుక్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షకు సంఘీభావం ప్రకటిస్తూ, ఆయన లేవనెత్తుతున్న ప్రజాస్వామ్య, విద్యా సంబంధిత సమస్యలను కేంద్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు.

దేశవ్యాప్తంగా పోటీ పరీక్షల నిర్వహణపై విద్యార్థులు, తల్లిదండ్రుల్లో విశ్వాసం దెబ్బతింటోందని పేర్కొంటూ, పరీక్షా వ్యవస్థను పటిష్ఠ పర్చాలన్నారు. ప్రశ్నాపత్రాల లీకేజీలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.  భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సమర్థవంతమైన వ్యవస్థను ఏర్పాటు చేయాలని కోరారు. ఈ నిరసన కార్యక్రమంలో సీపీఐ(ఎం) సత్తుపల్లి పట్టణ కార్యదర్శి కొలికపోగు సర్వేశ్వరరావు, రావుల రాజబాబు, మోరంపూడి వెంకట్రావు, చావా రమేష్, మోరంపూడి వెంకటేశ్వరరావు, కాపా వెంకట్ రమణ, చప్పిడి భాస్కర్, సైదా, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -