Tuesday, July 21, 2026
E-PAPER
Homeక్రైమ్చెరువులో గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యం

చెరువులో గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యం

- Advertisement -

– సోమవారం ఉదయం నీటిపై తేలిన మృతదేహం..
– కుటుంబ సభ్యులు, గ్రామస్తుల సహకారంతో బయటికి తీసిన ఘటన
నవతెలంగాణ – ఉప్పునుంతల 
నాగర్‌కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలం మామిళ్లపల్లి గ్రామానికి చెందిన ఆవుల తిరుపతయ్య (55) శనివారం మధ్యాహ్నం చేపల వేటకు వెళ్లి గల్లంతైన విషయం తెలిసిందే. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టినా ఫలితం లేకుండా పోయింది. తాజాగా సోమవారం ఉదయం చెరువు నీటిపై మృతదేహం తేలియాడుతూ స్థానికులకు కనిపించింది. దీంతో కుటుంబ సభ్యులు గ్రామస్తుల సాయంతో ఒడ్డుకు తీసుకొచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పంచనామా నిర్వహించి, పోస్టుమార్టం నిమిత్తం అచ్చంపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కాగా.. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -