Tuesday, July 21, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బీజేవైఎం జిల్లా అధ్యక్షుడిగా వంశీ గౌడ్

బీజేవైఎం జిల్లా అధ్యక్షుడిగా వంశీ గౌడ్

- Advertisement -

నవతెలంగాణ-జక్రాన్ పల్లి 
మండలంలోని తొర్లికొండ గ్రామానికి చెందిన వంశీ గౌడ్ బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు నియమితులయ్య రు. ఈ సందర్భంగా వంశీ గౌడ్ మాట్లాడుతూ భారతీయ జనతా యువ మోర్చా  జిల్లా అధ్యక్షుడిగా నన్ను నియమించినందుకు గౌరవనీయులు నిజామాబాద్ ఎంపీ శ్రీ ధర్మపురి అర్వింద్ కి, గౌరవనీయులు ఎమ్మెల్యే శ్రీ రాకేష్ రెడ్డి కి, శ్రీ ధన్‌పాల్ సూర్యనారాయణ కి, పసుపు బోర్డు చైర్మన్ శ్రీ పల్లె గంగారెడ్డి కి, బీజేపీ జిల్లా అధ్యక్షులు శ్రీ దినేష్ పటేల్ కులాచారి కి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాని అన్నారు.

నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునేలా పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి, యువతను సంఘటితం చేస్తూ, పార్టీ బలోపేతానికి అంకితభావంతో పనిచేస్తాను. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు, యువత సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తానని చెప్పారు. ఈ బాధ్యతను నాకు అప్పగించిన పార్టీ రాష్ట్ర నాయకత్వానికి, జిల్లా నాయకత్వానికి, అలాగే నాపై విశ్వాసం ఉంచిన ప్రతి నాయకుడికి, కార్యకర్తకు మరోసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నానని తెలియజేశారు. అందరి సహకారం, మార్గదర్శకత్వంతో పార్టీ ఆశయాల సాధన కోసం నిరంతరం శ్రమిస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -