– పొద్దుతిరుగుడు రైతుల పొట్టగొడుతున్న ప్రభుత్వం
– రసీదులు చేతిలో ఉన్నా.. ఖాతాల్లో సున్నా
– 50 రోజులు దాటినా అందని పంట సొమ్ము
– నిధుల నిర్లక్ష్యం, ఎల్ నీ నో ప్రభావంతో రైతన్న విలవిల
నవతెలంగాణ – సిద్దిపేటరూరల్
రైతు రాజ్యాం అన్నదాతకు అండగా ఉంటాం అంటూ ప్రగల్భాలు పలికే ప్రభుత్వానికి క్షేత్రస్థాయిలో రైతుల కష్టాలు అస్సలు పట్టడం లేదు. పొద్దుతిరుగుడు పంటను నమ్ముకుని ఆరుగాలం కష్టపడి పండించిన పంటను ప్రభుత్వానికి అప్పగించిన రైతులకు నిరాశే ఎదురవుతోంది. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అమ్మి 50 రోజులు గడుస్తున్నా నేటికీ వారి బ్యాంకు ఖాతాల్లో ఒక్క రూపాయి కూడా జమ కాలేదు. నిబంధనల ప్రకారం ధాన్యం అమ్మిన 48 గంటల వ్యవధిలో నగదు రైతులు అకౌంట్ లో జమ చేయాలి. దాదాపు రెండు నెలలైనా రైతుల ఖాతాలు మాత్రం ఖాళీగానే దర్శనమిస్తున్నాయి.
సిద్దిపేట జిల్లాలో 8 కొనుగోలు కేంద్రాల ద్వారా 3147 మంది రైతుల నుండి 4230 టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం పొద్దుతిరుగుడును కొనుగోలు చేసింది. మొత్తం రైతులకు 32.67 కోట్ల రూపాయలు చెల్లించాలి. కానీ రూ.18 కోట్ల రూపాయలు 1800 వందల మంది రైతులకు జమయింది. ఇంకా 1340 మంది రైతుల రూ.14 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో ప్రభుత్వం నగదు జమ చెయాల్సి ఉంది. ఇప్పటివరకు వారి ఖాతాల్లో పైసా జమ కాకపోవడంపై అన్నదాతలు తీవ్ర ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అప్పులు తెచ్చి పెట్టుబడి పెట్టాం..
పంట చేతికొచ్చాక అమ్ముకుంటే అప్పులు తీరుతాయనుకున్నాం. కానీ యాభై రోజులవుతున్నా పైసా రాలేదు. నేను 12 క్వింటాల్ పొద్దుతిరుగుడు ధాన్యం అమ్మినం 96 వేల రూపాయలు ప్రభుత్వం నుంచి రావాలి. వడ్డీలు పెరిగిపోతున్నాయి. ప్రభుత్వం వెంటనే అమౌంటు వేయాలి. – రైతు రమేష్ రావురుకుల
పెట్టుబడికి పైసలు లేవు
ధాన్యం అమ్మి 45 రోజులు దాటింది. రూ.70 వేలు రావాలి. మళ్ళీ పంట పెట్టుబడికి పైసలు లేవు. అప్పులు తెచ్చి పంట వేస్తే వడ్డీలు పెరుగుతున్నాయి. రోజువారీ ఇంటి ఖర్చులు, పిల్లల చదువుల ఫీజుల కోసం మళ్లీ కొత్తగా అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని, రైతుల బాధలను ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. – రైతు రాజు బుస్సాపూర్
కాంగ్రెస్ ప్రభుత్వంలో వ్యవసాయ రంగానికి మొండి చెయ్యి
ప్రభుత్వం నుంచి సకాలంలో డబ్బులు రాకపోవడంతో రైతులు స్థానిక వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సి వస్తోంది. ఒకవైపు తాము పండించిన పంట సొమ్ము ఎప్పుడు వస్తుందో తెలియని గందరగోళం, మరోవైపు వర్షాలు లేక ఉన్నదాతులు ప్రభుత్వం నిర్లక్ష్యంతో అన్నదాతలు అప్పుల కుప్పులు కూరుకుపోయే పరిస్థితి ప్రభుత్వం తీసుకొచ్చిందని కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి మొండిచేయి చూపెట్టిందని అన్నారు. పెరిగిపోతున్న అప్పుల భారం రైతులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. వెంటనే ప్రభుత్వం



