Sunday, September 20, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్చౌడూరు క్రషర్ మిషన్ ఆకస్మిక తణిఖీ

చౌడూరు క్రషర్ మిషన్ ఆకస్మిక తణిఖీ

- Advertisement -

నవతెలంగాణ-నవాబు పేట
మండల పరిధిలోని చౌడూరు గ్రామంలోని క్రషర్ మిషన్ ను సోమవారం రెవెన్యూ అధికారులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. గత కొన్ని రోజుల క్రితం గ్రామ సర్పంచ్ గ్రామ రైతులు ఆధ్వర్యంలో క్రషర్ మిషన్ యజమానికి నోటీసులు జారీ చేసినట్లు సమాచారం అందుకున్న సందర్భంగా గిర్దావారు రామాంజనేయులు, సర్పంచ్ సునిత, జీపీఓ ఆంజనేయులుతో పాటు క్రషర్ మిషన్ పనులు పరిశీలించారు. ఈ సందర్భంగా గిర్దావారు రామాంజనేయులు మాట్లాడుతూ.. రైతులు గ్రామ సర్పంచ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు, పై అధికారుల ఆదేశాల మేరకు తనిఖీలు చేసామని సంబంధించిన నివేదికను ఉన్నతాధికారులకు పంపిస్తామని వెల్లడించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -