- Advertisement -
నవతెలంగాణ-ఆలేరు టౌన్
ఆలేరు మాజీ శాసనసభ్యులు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, బూడిద బిక్షమయ్యగౌడ్ జన్మదిన వేడుకలు ఆలేరు పట్టణంలో సోమవారం ఎస్బిఐ బ్యాంక్ ఆవరణలో బీఆర్ఎస్ పట్టణ, మండల కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పార్టీ సభ్యులు, అభిమానుల సమక్షంలో కేక్ కట్ చేసి మిఠాయిలు పంచారు. అదేవిధంగా ఎస్బిఐ బ్యాంక్ ఎదురుగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. బస్టాండ్, రైల్వే గేట్ దగ్గర బాణాసంచా కాల్చి పార్టీ సభ్యులు సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పట్టణ, మండల అధ్యక్షులు పుట్ట మల్లేశం గౌడ్, గంగుల శ్రీనివాస్, మున్సిపల్ కౌన్సిలర్లు, వివిధ విభాగాల నాయకులు,పార్టీ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
- Advertisement -



