నవతెలంగాణ-ఆలేరు టౌన్
హైదరాబాదులోని అమరవీరుల స్మరక భవనంలో సోమవారం జరిగిన రాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటు చేసిన కేకే కమిటీతో సమావేశానికి, ఆలేరు పట్టణం నుండి తెలంగాణ మలిదశ ఉద్యమకారులు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలో భాగంగా తెలంగాణ ఉద్యమకారులకు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 250 గజాల స్థలం, పింఛన్, తెలంగాణ స్వాతంత్ర సమరయోధులుగా గుర్తించి హెల్త్ కార్డు, ప్రత్యేక గుర్తింపు కార్డు ఇవ్వాలన్నారు. అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా, ఉద్యమకారుల కోసం ఒక మంత్రివర్గ కమిటీని ప్రభుత్వం వేసిందని గుర్తించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో తెలంగాణ రాష్ట్రం కోసం ఈ ఆలేరు ప్రాంతంలో ఉద్యమం ఉవ్వెత్తున ఎగీసి పడిందని,కుటుంబాలను వదిలి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నామన్నారు.
నిజమైనటువంటి ఉద్యమకారులకు ప్రభుత్వం న్యాయం చేయాలన్నారు. ఈ సమావేశంలో ఉద్యమకారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జంపాల శ్రీనివాస్, నాయకులు అశోక్ ,ఎల్లయ్య మలిదశ ఉద్యమకారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.



