Tuesday, July 21, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఎల్‌నినో ప్రభావంపై రైతులకు అవగాహన

ఎల్‌నినో ప్రభావంపై రైతులకు అవగాహన

- Advertisement -

– ప్రత్యామ్నాయ పంటల సాగు, నీటి సంరక్షణ పై రైతులకు సూచనలు
– గజ్వేల్ ఏడిఏ బాబు నాయక్
నవతెలంగాణ – రాయపోల్ 

ఎల్ నినో ప్రభావం వలన తీవ్ర కరువు ఏర్పడి వానాకాలంలో వర్షాలు పడే పరిస్థితులు లేవని రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగు నీటి సంరక్షణపై అవగాహన కలిగి ఉండాలని గజ్వేల్ ఏడిఏ బాబు నాయక్ అన్నారు. సోమవారం రాయపోల్ మండలం కొత్తపల్లి గ్రామంలో ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో రైతులకు అవగాహన కల్పించేందుకు గ్రామసభ నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం తగ్గే అవకాశం ఉన్నందున రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

నీటి సంరక్షణ, తేమ నిర్వహణ, పంటల రక్షణ చర్యలను పాటించాలని కోరారు. వరికి ప్రత్యామ్నాయంగా జొన్న, సజ్జ, రాగులు, పచ్చకంకి మొక్కజొన్న, కంది, పెసర, మినుము, నువ్వులు, వేరుశెనగ, పొద్దుతిరుగుడు, ఆముదం వంటి తక్కువ నీటితో సాగు చేసే పంటలను ఎంపిక చేసుకోవాలని సూచించారు.ఉపాధి హామీ పథకం కింద ఫామ్‌పాండ్లు 100 శాతం సబ్సిడీతో అందుబాటులో ఉన్నాయని, వాటి ద్వారా వర్షపు నీటిని నిల్వ చేసుకుని బెట్ట పరిస్థితుల్లో పంటలకు అవసరమైన నీటిని అందించి నష్టాన్ని తగ్గించుకోవచ్చని వివరించారు.అలాగే బెట్ట పరిస్థితుల్లో పంటలను రక్షించేందుకు లీటర్ నీటికి 2.5 గ్రాముల చొప్పున 13:0:45 పొటాషియం నైట్రేట్ లేదా లీటర్ నీటికి 2 మి.లీ నానో యూరియా కలిపి ఆకులపై పిచికారీ చేయాలని సూచించారు. దీంతో పంటలు కొంతకాలం వరకు బెట్ట పరిస్థితులను తట్టుకునే అవకాశముంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి ఆర్. నరేష్, వ్యవసాయ విస్తరణ అధికారి రజిత, వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శి, రైతులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -