Tuesday, July 21, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్వరుణుడి కోసం మహాదేవునికి జలాభిషేకం

వరుణుడి కోసం మహాదేవునికి జలాభిషేకం

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ 
మండల కేంద్రంలోని మహాదేవుని ఆలయంలో సోమవారం వర్షం కురువాలని గ్రామ రైతుల ఆధ్వర్యంలో గ్రామస్తులు, వ్యాపారస్తులు కలిసి సంయుక్తంగా పరమేశ్వరునికి జలాభిషేకం చేశారు.ఈ సందర్భంగా గ్రామస్తులు, రైతులు మాట్లాడుతూ.. ఖరీఫ్ పంటలు మొదటి నుండి వర్షాలు అడపా దడపా వర్షాలు పడుతుండడంతో ధైర్యంతో మండలంలోని వివిధ గ్రామాల రైతులు వేలాది ఎకరాలలో ఖరీఫ్ పంటలు పెసర, మినుము, సోయా, కంది, పత్తి, వివిధ రకాల కూరగాయలు సాగు ప్రారంభించామన్నారు. వర్షాకాలం మొదటి నుండి తక్కువ వర్షపాతం నమోదు కావడంతో పంటకు పెట్టిన పెట్టుబడి కూడా వస్తుందో లేదో అని ఆందోళన చెందుతున్నారని తెలిపారు. ఎకరానికి వేల రూపాయలు ఖర్చు చేశామని రైతలు వాపోతున్నారని చెప్పారు. భారీ వర్షాల కురవక పోవడంతో దీనంగా ఆకాశం వైపు చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అయినా ఎంతకీ వానలు కురవడం లేదన్నారు. ఇక చేసేదేంలేక గ్రామస్తులు, వ్యాపారస్తులు, రైతులు దేవుళ్ళ గుళ్ళకు, గ్రామదేవతలకు, బోనాలు చేయడం, జలాభిషేకం, అన్నదానాలు, భజనలు, కీర్తనలు గ్రామాల్లో నిత్యం నిర్వహిస్తున్నారని తెలిపారు. వర్షాల కోసం ఆఖరి ప్రయత్నంగా ఈ పనికి పూనుకున్నామని వెల్లడించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -