- Advertisement -
నవతెలంగాణ – జుక్కల్
జుక్కల్ నూతన ట్రాన్స్ కో ఏఈ గా పీర్ నాయక్ సోమవారం తన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కార్యాలయ సిబ్బంది స్వాగతం పలికి, సన్మానించారు. ఇటీవలే ఇక్కడ పనిచేసిన మోహన్ నాయక్ బదిలీపై ఖమ్మం వెళ్ళారు. అతని స్థానంలో నిజామాబాద్ జిల్లాకు చెందిన పీర్ నాయక్ ను ప్రభుత్వం నియమించింది. ఈ కార్యక్రమంలో ట్రాన్స్కో సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



