Tuesday, August 11, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ లో వోల్టేజ్ విద్యుత్ సమస్యను పరిష్కరించాలి

 లో వోల్టేజ్ విద్యుత్ సమస్యను పరిష్కరించాలి

- Advertisement -

 నవతెలంగాణ-ఆలేరు టౌను 
ఆలేరు ప్రాంతంలో రైతులు ఎదుర్కొంటున్న లో వోల్టేజ్ సమస్యని వెంటనే పరిష్కరించాలని, అఖిలపక్ష కమిటీ కన్వీనర్, పసుపునూరి వీరేశం ఆలేరు పట్టణంలో విద్యుత్ అధికారులను ఒక ప్రకటనలో కోరారు. నాణ్యమైన విద్యుత్తు సరఫరా కాకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందుల గురవుచున్నారని తెలియజేశారు. వివిధ కారణాలవల్ల చేతికి వచ్చిన పంట మొత్తం తుడిచిపెట్టుకుపోతే, మరోపక్క అప్పులు చేసి మరీ మరోసారి పంటలు వేసిన రైతును విద్యుత్ సమస్య వేధిస్తుందన్నారు.

 ఎల్ వినో ప్రభావం వల్ల వర్షాలు లేకపోవడం వలన, విద్యుత్ కోత మరియు లో వోల్టేజ్ సమస్యతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, సంబంధిత అధికారులు, రాష్ట్ర ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య స్పందించి అప్రకటిత విద్యుత్ కోతను ఎత్తివేయాలని, వోల్టేజ్ సమస్య పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -