నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని నాగుల్గావ్ గ్రామంలో సాగు అవుతున్న సోయాబీన్,ప్రత్తి మరియు పుచ్చకాయ మరియు పసుపు పంటలను సోమవారం నాడు వ్యవసాయ విస్తరణ అధికారి సతీష్ చిద్రవార్ క్షేత్ర స్థాయి లో పరిశీలించి రైతు సోదరులకు తగు సలహాలు, సూచనలు చేశారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడుతూ.. సోయాబీన్ పంటలో కలుపు నివారణకు సూచనలు ఇవ్వడం చేసారు . సోయాబీన్ పంటలో గడ్డి జాతి కలుపు నివారణకు Propiquizafop( Agil or Society )250 ml ఎకరాకు లేదా Quizalofop ethyl ( Targa Super) 400ml ఎకరాకు మరియు వెడల్పాటి ఆకుల కలుపు నివారణకు Imazithapyr(Pursuit/ Lagaam)400ml ఎకరాకు పిచికారి చేయాలని సూచించడం జరిగింది. గడ్డి జాతి మరియు వెడల్పాటి ఆకుల కలుపు నివారణకు Propaquizafop 2.5% + Imazethapyr 3.75% w/w(Shaked) 800ml ఎకరాకు లేదా Imazethapyr 35% + Imazamox 35% WG (Odyssey) 40gm ఎకరాకు 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలని సూచించడం జరిగింది.
ప్రత్తి పంటలో రసం పీల్చే పురుగులైన తెల్ల దోమ,పచ్చ దోమ,పెను బంక గమనించి దాని నివారణకు వేప నూనె(1500ppm) 500ml ఎకరాకు + Acephate 300గ్రాములు లేదా Acetamiprid 50 గ్రాములు ఎకరాకు కలిపి పిచికారి చేయాలని సూచించడం జరిగింది. పుచ్చకాయ లో రసం పీల్చే పురుగుల నివారణకు మరియు డ్రిప్ సిస్టమ్ నిర్వహణ పైన సలహాలు ఇవ్వడం జరిగింది. ఈరోజు క్షేత్ర స్థాయి సందర్శనలో రైతు సోదరులు హరి విట్టోబ పటేల్, హరి క్రిష్ణ, శివరాం ప్రకాష్ స్వామి తదితరులు పాల్గొన్నారు.



