- Advertisement -
నవతెలంగాణ-మద్నూర్
డోంగ్లి మండలంలోని మోగా గ్రామంలో సోమవారం ఆ గ్రామ సర్పంచ్ హాలే బస్వంత్, ఎస్సై మోహన్ రెడ్డి, ఉపసర్పంచ్ పంచాయతీ పాలకవర్గం సభ్యులతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎస్సై సర్పంచ్ మాట్లాడుతూ.. మొక్కలతోనే మానవునికి మనగడ లభిస్తుందన్నారు. మొక్కలు పర్యావరణాన్ని కాపాడుతుందని చెప్పారు. మొక్కలతోనే వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. చెట్లు పెంచడం ప్రతి ఒక్కరి బాధ్యత అని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ బాబు పటేల్, పాలకవర్గం సభ్యులు, గ్రామ కార్యదర్శి గ్రామస్తులు పాల్గొన్నారు.
- Advertisement -



