Tuesday, July 21, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అధిక ధరలకు ఎరువులు అమ్మితే కఠిన చర్యలు: ఏఓ రాజు

అధిక ధరలకు ఎరువులు అమ్మితే కఠిన చర్యలు: ఏఓ రాజు

- Advertisement -

నవతెలంగాణ-మద్నూర్
మద్నూర్ మండలంలో ఎరువుల దుకాణాలను సోమవారం మండల వ్యవసాయ అధికారి రాజు తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎరువులు అమ్మే పార్టీలైజర్ యజమానులకు హెచ్చరికలు జారీ చేస్తూ ఎరువులు అధిక ధరలకు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎరువుల యజమానులు వచ్చిన స్టాక్ ఎప్పటికప్పుడు మండల వ్యవసాయ అధికారికి తెలపాలని చెప్పారు. అలాగే వచ్చిన స్టాక్ వివరాలు రాసి పెట్టుకోవాలని సూచించారు. ముఖ్యంగా రైతులకు ప్రభుత్వం నిర్ణయించిన ఏంఆర పీ ధరలకే ఎరువులు విక్రయించాలని ఆదేశించారు. అధిక ధరలకు అమ్మితే కఠిన చర్యలు ఉంటాయన్నారు. ఎరువుల ధరలు , స్టాక్ వివరాలు లేని పలు ఎరువుల దుకాణాల యజమానులులకు నోటీసులిచ్చారు. రైతులకు సరిపడా యూరియా అందుబాటులో ఉందనీ, ఫెర్టిలైజర్ దుకాణాల నుండి యూరియా పొందడానికి ఇంటి నుంచే యాప్ ద్వారా బుక్ చేసుకొని రైతులు తీసుకోవచ్చునని తెలియజేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -