- Advertisement -
నవతెలంగాణ-మద్నూర్
మొక్కలు నాటడం ప్రతి ఒక్కరి బాధ్యతని, చెట్లు పెంచుదాం పర్యావరణం కాపాడుదాం అంటూ సర్పంచ్ విశాలాక్షి రాం పటేల్ గ్రామ ప్రజలకు పిలుపునిచ్చారు. మండలంలోని పెద్ద షకర్గా గ్రామంలో సర్పంచ్ విశాలాక్షి రామ్ పటేల్ ఆధ్వర్యంలో సోమవారం పంచాయతీ పాలకవర్గం సభ్యులు గ్రామస్తులు కలిసి మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. మొక్కలు నాటడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, నాటిన మొక్కను పరిరక్షించాలని, చెట్లు పెంచడం పర్యావరణం కాపాడుదామన్నారు. ఈ కార్యక్రమంలో సలాబత్పూర్ ఆంజనేయస్వామి ఆలయ టెంపుల్ మాజీ చైర్మన్ రామ్ పటేల్, గ్రామ కార్యదర్శి లక్ష్మణ్, పంచాయతీ పాలకవర్గం సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
- Advertisement -



