అమెరికాలో విజయవంతంగా ప్రదర్శితమవు తున్న సైకాలజికల్ థ్రిల్లర్ ‘ఎం4ఎం(మోటివ్ ఫర్ మర్డర్)' మూవీ 60 రోజుల విజయోత్సవాన్ని శాన్ఫ్రాన్సిస్కో బే ఏరియాలోని సినీ లౌంజ్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో దర్శక-నిర్మాత మోహన్ వడ్లపట్ల, హీరోయిన్ జో శర్మ సంయుక్తంగా 'ఎం4ఎం-2' సీక్వెల్‌ను అధికారికంగా ప్రకటించారు. ఈ కార్యక్రమానికి 'ఎం4ఎం అభిమానులు, కమ్యూనిటీ నాయకులు, సినీ ప్రముఖులు, మీడియా ప్రతినిధులు, విశిష్ట అతిథులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. కేక్ కట్ చేసి చిత్ర విజయాన్ని ఘనంగా జరుపుకున్నారు.
ఈ సందర్భంగా దర్శక-నిర్మాత మోహన్ వడ్లపట్ల మాట్లాడుతూ, ”ఎం4ఎంవిజయానికి ప్రేక్షకుల అపారమైన ఆదరణే ప్రధాన కారణం. నటీనటులు, సాంకేతిక నిపుణులు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు, మీడియా అందించిన సహకారం లేకుండా ఈ విజయాన్ని సాధించడం సాధ్యమయ్యేది కాదు. ప్రేక్షకుల ప్రేమాభిమానాలే మాకు మరింత బాధ్యతను పెంచాయి. అదే ఉత్సాహంతో సీక్వెల్ ని మరింత ఉన్నత ప్రమాణాలతో రూపొందిస్తు న్నాం అని తెలిపారు.
నాయిక జోశర్మ సీక్వెల్‌కు సంబంధించిన ఆసక్తికర మైన విశేషాలను వెల్లడించారు. తొలి భాగాన్ని మించిన ఉత్కంఠ, ఊహించని మలుపులు, అత్యాధునిక సాంకేతికతతో భారీ సైకాలజికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిస్తున్నామన్నారు.
అంతకుమించి సీక్వెల్ ..
- Advertisement -
- Advertisement -



