Tuesday, July 21, 2026
E-PAPER
Homeసినిమామైత్రి ద్వారా రిలీజ్

మైత్రి ద్వారా రిలీజ్

- Advertisement -


ఎల్రెడ్ కుమార్ సమర్పణలో ఆర్ఎస్ ఇన్ఫోటైన్‌ మెంట్ బ్యానర్ మీద మతిమారన్ పుగళేంది తెరకెక్కిస్తున్న చిత్రం ‘మండాడి’. ఈ సినిమాలో సుహాస్, సూరి ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు. ఇప్పటి వరకు ఈ మూవీ నుంచి వచ్చిన కంటెంట్ అందరినీ మెప్పించింది.
సుహాస్, సూరి పాత్రలు, ఆ కారెక్టర్స్ మేకోవర్ అదిరిపోయింది. ఇక ఈ సినిమాలోని యాక్షన్ సీక్వెన్స్, విజువల్స్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తా యని టీం నమ్మకంగా చెబుతోంది. బోట్ సీక్వెన్స్ అందరూ ఆశ్చర్యపోయేలా ఉంటాయని ఆల్రెడీ టీం ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఈ మూవీని సెప్టెంబర్ 10న గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతున్నారు. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో సినిమా విడుదల కానుంది. ఇక ఈ సినిమాని తెలుగులో మైత్రి మూవీస్ రిలీజ్ చేయబోతోంది.
ఏపీ, తెలంగాణలో ఈ చిత్రాన్ని మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఎల్ఎల్‌పి భారీ ఎత్తున విడుదల చేయనుంది. ఈ చిత్రంలో మహిమా నంబియార్ హీరోయిన్‌గా నటించారు. సత్యరాజ్, రవీంద్ర విజయ్, మిథున్, బాల శరవణన్ తదితరులు ఇతర కీలక పాత్రలను పోషించారు.
ఈ సినిమాకి సంగీతాన్ని జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందించగా, ఎస్.ఆర్. కథిర్ సినిమాటోగ్రఫర్‌గా పని చేశారు. ఎడిటింగ్‌ను ప్రదీప్ ఇ. రాఘవ్ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -