- Advertisement -
అంతర్జాతీయ
రిథమిక్ జిమ్నాస్టిక్స్ పోటీలు
నవతెలంగాణ-హైదరాబాద్ : హైదరాబాద్‌కు చెందిన యువ జిమ్నాస్ట్ అంజన గుణుకుల అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటింది. ఫ్రాన్స్ లోన కేన్స్‌లో జరిగిన లిటిల్‌స్టార్ ఇంటర్నేషనల్ రిథమిక్ జిమ్నాస్టిక్స్ కాంపిటీషన్‌లో అంజన పసిడి పతకం సాధిం చింది. రిబ్బన్ అపరేటస్ విభాగంలో అంజన అగ్రస్థానంలో నిలిచింది. స్వర్ణ పతకం సాధించిన అంజనను సోమవారం ఎల్బీ స్టేడియంలో కార్యక్రమంలో స్పోర్ట్స్ అథారిటీ డిప్యూటీ డైరెక్టర్ రవీందర్, తెలంగాణ జిమ్నాస్టిక్స్ సంఘం కార్యదర్శి సోమేశ్వర్, కోచ్ అలిసా జో అభినందించారు.
- Advertisement -



