Tuesday, July 21, 2026
E-PAPER
Homeకరీంనగర్బాధిత కుటుంబానికి టాటా ఏఐఏ రూ.4.5 కోట్ల జీవిత బీమా క్లెయిమ్‌

బాధిత కుటుంబానికి టాటా ఏఐఏ రూ.4.5 కోట్ల జీవిత బీమా క్లెయిమ్‌

- Advertisement -

సంస్థ ప్రతినిధుల చేతుల మీదుగా చెక్కు అందజేత

అందరికీ బీమా రక్షణే లక్ష్యం: క్లస్టర్ హెడ్ వినోద్

ఉచిత కన్సల్టేషన్.. ఉపాధి అవకాశాలు : పుష్ప, బిజినెస్ అసోసియేట్

నవతెలంగాణ కరీంనగర్ : రోడ్డు ప్రమాదంలో మరణించిన కరీంనగర్‌కు చెందిన పొన్నం శ్రీకాంత్ కుటుంబానికి టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ రూ.4.5 కోట్ల భారీ బీమా పరిహారం అందజేసింది. శ్రీకాంత్ తల్లి, నామినీ అయిన పొన్నం విజయకు సంస్థ క్లస్టర్ హెడ్ వి. వినోద్, ఇతర ప్రతినిధులు గురువారం ఈ చెక్కును పంపిణీ చేశారు.

కరీంనగర్‌కు చెందిన పొన్నం శ్రీకాంత్ నవంబర్ 2024లో ఏటా రూ.70 వేల ప్రీమియంతో టాటా ఏఐఏ సంస్థలో టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నారు. డిసెంబర్ 2025లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన మరణించగా, సంస్థ వేగంగా స్పందించి క్లెయిమ్ ప్రక్రియ పూర్తి చేసి బాధిత కుటుంబానికి చెక్కు అందజేసింది. జీవితంలో అనుకోని విపత్తులు సంభవించినప్పుడు కుటుంబాలు ఆర్థికంగా రోడ్డున పడకుండా ఉండేందుకు టర్మ్ ఇన్సూరెన్స్ ఎంతో దోహదపడుతుందని సంస్థ ప్రతినిధులు తెలిపారు. తక్కువ ప్రీమియంతో ఎక్కువ బీమా రక్షణ లభించే ఇలాంటి పాలసీలు ప్రతి కుటుంబానికి అవసరమని, పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ముందస్తుగా బీమా రక్షణ కల్పించుకోవాలని సూచించారు.

ఉచిత కన్సల్టేషన్.. ఉపాధి అవకాశాలు

సీనియర్ బిజినెస్ అసోసియేట్ లీడర్ మల్లారపు పుష్ప మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరికీ ఇన్సూరెన్స్ అందించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని పేర్కొన్నారు. అత్యవసర సమయాల్లో కుటుంబాన్ని ఆదుకునేలా హెల్త్, లైఫ్ ఇన్సూరెన్స్ ఉండాలని, సరైన పాలసీల ఎంపిక కోసం 9491679493 నెంబర్ ద్వారా ఉచితంగా సంప్రదించవచ్చని తెలిపారు. బీమాపై సరైన అవగాహన కల్పించడంతో పాటు, ఉన్న ఊరిలోనే ఉపాధి పొందేందుకు దేశ వ్యాప్తంగా నియమాలు చేపట్టి కొత్త ఇన్సూరెన్స్ అడ్వైజర్లకు అవకాశం కల్పిస్తున్నామన్నారు. బిజినెస్ అసోసియేట్ ఏజెన్సీ డెవలప్‌మెంట్ ఆఫీసర్ల భర్తీ ప్రక్రియ కూడా జరుగుతోందని, ఆసక్తి గలవారు ఆన్‌లైన్ లింక్

( https://mallarapupushpa.tataaiapartner.com?tid=gvuiu ) ద్వారా సంప్రదించాలని కోరారు.ఈ కార్యక్రమంలో లబ్ధిదారురాలు పొన్నం విజయ, మేనేజింగ్ పార్ట్‌నర్ కే. నరేందర్ రావు, బ్రాంచ్ మేనేజర్లు కే. వీరస్వామి, కే. ఆదర్శ్, బీఏఎంలు బి. చంద్రశేఖర్, వి. శ్రీకాంత్, ఆర్. నవీన్, ఆర్.విజయ్, సీనియర్ బ్రాంచ్ ఆపరేషన్స్ జే. మహేందర్, ట్రైనర్ డి. వెంకటేష్ వర్మ, సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -