నవతెలంగాణ-ఆలేరు టౌన్ : ఇసుక ట్రాలి ఢీకొని మృతిచెందిన చిన్నారి కుటుంబానికి తగిన విధంగా న్యాయం జరిగేలా చూస్తామని, సర్కిల్ ఇన్స్పెక్టర్ యాదాద్రి అన్నారు. మండలంలోని కోలానుపాక గ్రామంలో ఇసుక ట్రాలీ ఢీకొని చిన్నారి మృతి చెందింది. దీంతో ఆలేరు పట్టణంలో మంగళవారం కుటుంబ సభ్యులు , గ్రామస్తులు జాతీయ రహదారిపై ఆందోళన చేశారు.
ఆలేరు సర్కిల్ ఇన్స్పెక్టర్ యాలాద్రి తెలిపిన వివరాల ప్రకారం ఆలేరు మండలం కొలను పాక గ్రామంలో శ్రీరాముల కర్ణాకర్ కుమార్తె శ్రీరాముల హన్సిక (3) ఇంటి ముందు ఆడుకుంటుండగా ఇసుక ట్రాలీ నెంబర్ ఏపీ 36, 5628 నెంబర్ గల వాహనం చిన్నారిని ఢీ కొట్టడంతో తీవ్ర గాయాలు కాగా, ఆలేరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం, చిన్నారి పరిస్థితి విషమంగా ఉండడంతో, వైద్యులు మెరుగైన చికిత్స కొరకు హైదరాబాద్ తీసుకువెళ్లలని సూచించినట్లు చెప్పారు. ఈ లోపే చిన్నారి మృతి చెందిందని వైద్యులు నిర్ధారించినట్లు చెప్పారు.
దీంతో చిన్నారి మృతదేహంతో బంధువులు జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించాగా . సిఐ యాలాద్రి, ఎస్సై ఎన్ వినయ్ కుమార్ వారికి నచ్చజెప్పి శాంతింపజేశారు. ఒక్కసారిగా జరిగిన ఈ విషాదంతో కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. ఎస్ ఐ ఎన్ వినయ్ పంచనామా నిర్వహించారు. కెసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ యాలాద్రి విలేకరులకు తెలియజేశారు.
అయితే డ్రైవర్ కావటి రవి అజాగ్రత్తగా , నిర్లక్ష్యం వాహనం నడపగా ఈ ఘోరం చోటు చేసుకోవడంతో నిందితుడిని కఠినంగా శిక్షించాలని కుటుంబ సభ్యులు , గ్రామస్తులు డిమాండ్ చేశారు.



