Thursday, July 23, 2026
E-PAPER
Homeకరీంనగర్అడ్రస్ లేని యువ నాయకత్వం ?

అడ్రస్ లేని యువ నాయకత్వం ?

- Advertisement -

– పార్టీ కార్యక్రమాలలో అంతంత మాత్రమే!
– అధికార పార్టీలో యూత్ ఆర్గనేషన్ తక్కువే అని చెప్పకనే చెప్పుతున్నా నాయకులు
నవతెలంగాణ-చందుర్తి: అధికార పార్టీ కార్యక్రమాల్లో యూత్ నాయకత్వం అంతంతే ఉన్నట్లుగా ప్రచారం సాగుతోంది. వేములవాడ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ఎన్నికలు గత సంవత్సరం కిందట జరిగాయి. ధర్మపురి శ్రీనివాస్ పైన్యాత నవీన్ విజయం సాధించిన సంగతి విదితమే కానీ యూత్ ఎన్నికల సమయంలో ఉన్న ఊపు ఇప్పుడు పార్టీ కార్యక్రమంలో ఎక్కడ కనపడుతలేదనే కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో చర్చ మొదలైందని తెలుస్తుంది.ఈ మధ్య కాలంలో ప్రభుత్వ విప్ కార్యక్రమాల లో యూత్ నియోజకవర్గ బాద్యులు ఎవరు హాజరు కాకపోవడమే యువ నాయకత్వం అడ్రస్ దూరంగా ఉందని అనుమానాలకు తావిస్తోంది.
యువ నాయకత్వమే పార్టీలో కీలకం
యువత చేతుల్లోనే రాజకీయ భవిష్యత్ ఉంటుందని రాజకీయ ప్రముఖులు అన్నా సందర్భాలు ఎన్నో ఉన్నాయి.దీంతో రాజకీయ పార్టీల్లో ముఖ్య పాత్ర వహించి ఆ పార్టీ కార్యక్రమాలను ముందుకు తీసుకు పోయే విదంగా యువ నాయకులు బాధ్యత తీసుకుంటారు.అందుకు ఆయా రాజకీయ పార్టీ లో యూత్ వింగ్ ను ప్రోత్సయిస్తారు.దీంతో యూత్ ఎన్నికల నిర్వహణ తో పార్టీ బాధ్యతలు ఇవ్వడం జరుగుతుంది.కానీ అధికార పార్టీ లో అంత పెద్దగా యూత్ విభాగం నిమ్మకు నీరెత్తినట్లుగానే ఉందని తెలుస్తోంది. నియోజకవర్గ పరిధిలో ఎక్కడ పార్టీ కార్యక్రమాలు నిర్వయించిన దాఖలు లేవని ఆ పార్టీ నాయకులే ద్వారా తెలిసింది.
జెడ్పిటిసి స్థాయిలో యూత్ ఎన్నికలు?
నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ఎన్నికలు గత రెండు సంవత్సరాల కిందట జరిగిన సంగతి విదితమే అందుకు పార్టీలకు అతీతంగా యువతి యువకులు ఆన్ లైన్ ఓటింగ్ జరిపారు.దీంతో ఆయా గ్రామాల చెందిన వివిధ పార్టీల సంబందించిన యువత ను పోగు చేయడానికి గ్రామాల్లో ఎజెంట్లను ఏర్పాటు చేసుకొని మందు విందు డబ్బులు పంపకాల తో యువత పార్టీలకు అతీతంగా ఓట్లు వేశారని సమాచారం.
ప్రభుత్వ పథకాల ప్రచారమేది?
ప్రభుత్వ పథకాల ప్రచారం లో యూత్ విభాగం ముందు ఉండి అమలు చేస్తున్నా స్కీమ్ లు సంవేశాలు నిర్వహించి మీడియా ద్వారా ప్రచారం చేయాల్సి ఉంటుంది. కానీ పార్టీ పేరుతో విద్యార్థులకు పెన్నులు, పరీక్ష ప్యాడ్స్ పంచుతూ వారి హోదాను కాపాడుకుంటున్నారని ఆరోపణలు వస్తున్నాయి.ఆయా పార్టీల ముఖ్య నాయకులు వచ్చినప్పుడే మెరుపు తీగల వచ్చి ముఖ్యనాయకునికి నమస్తే పెట్టిపోవడం తప్పా? ఇతర కార్యక్రమాల కు దూరం గానే ఉంటు వారి పోస్ట్ ను కాపాడుకుంటున్నారా?అని విమర్శలకు తావిస్తోంది

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -