Wednesday, July 22, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంసర్‌‌ను సకాలంలో పూర్తి చేయాలి

సర్‌‌ను సకాలంలో పూర్తి చేయాలి

- Advertisement -

రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్‌) ప్రక్రియను సకాలంలో పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారులను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి.సుదర్శన్ రెడ్డి ఆదేశించారు. హైదరాబాద్‌‌లోని ఈసీ ప్రధాన కార్యాలయం నుంచి మంగళవారం డీఈఓలతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఓటర్లు ఎన్యుమరేషన్ ఫారాలను ఆన్ లైన్ లో సమర్పిస్తే హార్డ్ కాపీ కోసం బీఎల్ఓలు వారిని ఇబ్బంది పెట్టొద్దని సూచించారు. ఓటర్‌ ‌నమోదు ఫారాలు సమర్పిం చేటప్పుడు ఆధార్ కార్డు తప్పనిసరి అని చెప్పొద్దని సూచించారు. ఫారాల పూరింపు, ఇతర అంశాలపై ఓటర్లకు అవసరమైన సహా యాన్ని అందించి, వారి ఫిర్యాదులను పరిష్క రించాలని ఆదేశించారు. గైర్హాజరు, నివాసం మారిన, మరణించిన ఓటర్ల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి రికార్డుల్లో నమోదు చేయాలని సూచించారు. డిజిటలైజేషన్ ప్రక్రి యను వేగవంతం చేయాలన్నారు. రాజకీయ పార్టీలతో నిర్వహించే సమావేశాల్లో పార దర్శకతను పాటిస్తూ, సంబంధిత వివరాలను నమోదు చేయాలని ఆదేశించారు. పట్టణ ప్రాంతాలు, పురోగతి తక్కువ ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. వారంలోగా ప్రతి జిల్లాలో ఎన్యుమరేషన్ ప్రక్రియ 90శాతం పూర్తయ్యేలా తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించారు. నో మ్యాపింగ్ కేటగిరీలో ఉన్న ఓటర్లను పూర్తి స్థాయిలో ధృవీకరించి తగిన చర్యలు తీసు కోవాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్‌‌లో అదనపు ప్రధాన ఎన్నికల అధికారి వాసం వెంకటేశ్వర్ రెడ్డి, ఉప ప్రధాన ఎన్నికల అధికారి జిఎస్. చారిలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -