Wednesday, July 22, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఫసల్ బీమా యోజన పథకాన్ని అమలు చేయాలి 

ఫసల్ బీమా యోజన పథకాన్ని అమలు చేయాలి 

- Advertisement -

రాష్ట్ర నాయకులు జనార్దన్ రెడ్డి
నవతెలంగాణ-మిడ్జిల్ 

కేంద్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి ఫసల్ భీమా యోజన పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని రాష్ట్ర నాయకులు జనార్దన్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఫసల్ బీమా యోజన పథకాన్ని అమలు చేయాలని నిరసిస్తూ బుధవారం మండల కేంద్రంలో తహసిల్దార్ కార్యాలయం ఎదుట మండల అధ్యక్షులు నరేష్ నాయక్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ.. పసల్ బీమా యోజన పథకం రైతులకు ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు. రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యంగా పనిచేయాలని డిమాండ్ చేశారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని తహసిల్దార్ రాఘవేందర్ రెడ్డి కి వినతిపత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాజేశ్వర్, పల్లె తిరుపతి, మాజీ మండల అధ్యక్షులు లాలు, రమేష్ జీ,కిషన్ మోర్చా మండల అధ్యక్షులు చిర్ర శేఖర్ రెడ్డి,మండల ప్రధాన కార్యదర్శి వాసుదేవ్ , మండల ఉపాధ్యక్షులు వెంకటరెడ్డి, మహిళా మోర్చా మండల అధ్యక్షులు షహజాది బేగం ,ఎల్లయ్య, వస్పుల్ ఆంజనేయులు, కావలి నరేష్, భీమయ్య, విష్ణువర్ధన్, భీమయ్య, యాదయ్య, చంద్రశేఖర్, జంగయ్య, బిర్లా శేఖర్, నాగేష్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -