Wednesday, July 22, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అసైండ్ భూములకు యాజమాన్య హక్కు కల్పించాలి

అసైండ్ భూములకు యాజమాన్య హక్కు కల్పించాలి

- Advertisement -

భూ రక్షణ సమితి జిల్లా అధ్యక్షుడు మోత్కుపల్లి రవి
నవతెలంగాణ-ఆలేరు టౌన్ 

అసైన్డ్ భూములకు, లావన్ పట్టా, ఇనాం భూములకు పూర్తి యాజమాన్య హక్కులు కల్పించాలని , భూ రక్షణ సమితి జిల్లా అధ్యక్షుడు మోత్కుపల్లి రవి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అసైన్డ్ భూములకు హక్కులు కల్పిస్తామన్న హామీ, ప్రస్తుతం అధికారంలో ఉండగానే అసైన్డ్ భూమి యజమానులకు యాజమాన్య హక్కు కల్పించాలని కోరారు. యాజమాన్య హక్కు కోసం ఈ నెల 24న భువనగిరిలోని ఎస్వీ హోటల్ ఆడిటోరియంలో నిర్వహించే సమీక్ష సమావేశ కరపత్రాలను మండల కేంద్రంలో పంపిణీ చేశారు. 

ఈ సందర్భంగా అసెండు భూముల యజమానులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ మల్కాజ్గిరి కార్యదర్శి శ్రీకాంత్ జిల్లా నాయకులు ధనరాజ్, నాయకులు ఒంగోలు పాలయ్య, ములుగు సోమలింగం తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -