నవతెలంగాణ-ఆలేరు టౌన్
ఈనెల 28న ఉదయం 10 గంటలకు వరంగల్ లో భారత కార్మిక సంఘాల సమాఖ్య న్యూ, తెలంగాణ రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించనున్న బహిరంగ సభ విజయవంతం చేయాలని ఆలేరు పట్టణంలో బుధవారం తెలంగాణ రైతు కూలి సంఘం ఆధ్వర్యంలో కరపత్రం ఆవిష్కరించారు. సభకు అధిక సంఖ్యలో సబ్బండ వర్గాల ప్రజలు హాజరై విజయవంతం చేయాలని ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి కేమిడి ఉప్పలయ్య విజ్ఞప్తి చేశారు.
కార్యక్రమంలో యాదాద్రి భువనగిరి జిల్లా తెలంగాణ రైతు కూలి సంఘం జిల్లా అధ్యక్షులు కుర్మిల బాబు, పి ఓ డబ్ల్యు శ్రీ సంఘటన జిల్లా కన్వీనర్ కస్తూరి సావిత్ర, తెలంగాణ రైతు కూలి సంఘం జిల్లా నాయకులు గుజ్జ పాండు ,అరుణోదయ రాష్ట్ర నాయకులు నమిల అంజిబాబు, లక్ష్మీనారాయణ తదితరులు కరపత్రం ఆవిష్కరణలో పాల్గొన్నారు.



