పరిశీలించి సానుకూల నిర్ణయం తీసుకుంటాం:
సాంస్కృతిక, పర్యాటక శాఖ
ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వాణీ ప్రసాద్
ప్రముఖ సాహితీవేత్త
గుడిపాటికి దాశరథి పురస్కారం ప్రదానం
నవతెలంగాణ-కల్చరల్
ప్రజా ఉద్యమ కవి డాక్టర్ దాశరథి కృష్ణమాచార్యను నిర్బం ధించిన నిజామాబాద్ ఖిల్లా జైలును స్మారకంగా అభివృద్ధి చేయడం తోపాటు ఆయన విగ్రహం ఏర్పాటుకు కృషి చేస్తామని సాంస్కృతిక, పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వాణీ ప్రసాద్ తెలిపారు. అలాగే, రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో కూడా విగ్రహ ప్రతిష్ట అంశాలను ప్రభుత్వం పరిశీ లించి సానుకూల నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. హైదరాబాద్ రవీంద్రభారతి ప్రధాన వేదికపై బుధవారం భాషా, సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజా ఉద్యమ కవి డాక్టర్ దాశరథి కృష్ణమాచార్య జయంతి వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రముఖ సాహితీవేత్త గుడిపాటికి దాశరథి పురస్కారంగా రూ.1,01,116, జ్ఞాపిక, ప్రశంసాపత్రాన్ని అందజేసి సత్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. దాశరథి సమసమాజ స్థాపన కోసం కలలు కన్న మహాకవి అని, ఆయన సాహిత్యం నేటికీ సమాజానికి స్ఫూర్తినిస్తోందని తెలిపారు. సాంస్కృతిక సారథి అధ్యక్షులు డాక్టర్ వెన్నెల గద్దర్ మాట్లాడుతూ.. బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన దాశరథి బడుగు, బలహీన వర్గాల సంక్షేమాన్ని ఆకాంక్షిస్తూ సామ్యవాద, మార్క్సిస్టు భావజాలంతో కవిత్వాన్ని సృష్టించారని చెప్పారు. కుల, మతాలకతీతంగా సమాజం పట్ల నిబద్ధత కలిగినవారే చిరస్థాయిగా నిలిచే సాహిత్యాన్ని సృష్టిస్తారని, అందుకే దాశరథి రచనలు శాశ్వతంగా నిలిచిపోయాయ ని చెప్పారు. అంతకుముందు భాషా, సాంస్కృతిక శాఖ సంచాలకులు డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి స్వాగతం పలుకుతూ తెలంగాణ అనేక పోరాటా ల గడ్డ అని, అలాంటి ఉద్యమాల నుంచి వెలుగులోకి వచ్చిన అభ్యుద య కవుల్లో దాశరథి అగ్రగణ్యురని కొనియాడారు. నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడి జైలు శిక్షను అనుభవించిన ధైర్యవంతుడైన కవి అని చెప్పారు. అవార్డు గ్రహీత గుడిపాటి ‘పాలపిట్ట’ పత్రిక ద్వారా అనేక మంది యువ సాహితీవేత్తలకు మార్గదర్శకుడిగా నిలిచారని అభినందించారు. ఈ కార్యక్రమంలో దాశరథి పురస్కార న్యాయనిర్ణే తల సంఘం అధ్యక్షులు డాక్టర్ అమ్మంగి వేణుగోపాల్, దాశరథి కుమార్తె ఇందిర, కుమారుడు లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
నిజామాబాద్ ఖిల్లా జైలులో దాశరథి విగ్రహం ఏర్పాటు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



