Friday, July 24, 2026
E-PAPER
Homeజాతీయంగోడీ మీడియాపై ప్రజాగ్రహం

గోడీ మీడియాపై ప్రజాగ్రహం

- Advertisement -

భారాన్ని మోస్తున్న ఫీల్డ్ రిపోర్టర్లు
మోడీ ప్రభుత్వ అనుకూల ప్రచారంతో ప్రజల్లో పేరుకుపోయిన ఆగ్రహం
జంతర్‌మంతర్ వద్ద సీజేపీ నిరసనల్లో బహిర్గతం
సేఫ్ జోన్‌లో యాజమాన్యాలు.. బలవుతున్న విలేకరులు
ప్రధాన మీడియా పక్షపాత ధోరణిపై ఆందోళన

దశాబ్దకాలంగా కేంద్రంలోని మోడీ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తోందంటూ విమర్శలు ఎదుర్కొంటున్న ప్రధాన స్రవంతి టెలివిజన్ మీడియాపై ప్రజల్లో పేరుకుపోయిన అసంతృప్తి జంతర్‌మంతర్‌లో జరిగిన సీజేపీ నిరసనల్లో బహిర్గతమైంది. అయితే టీవీ స్టూడియోలలో రాజకీయ ఎజెండాలను రూపొం దించే యాజమాన్యాలు, ఎడిటర్లు, స్టార్ యాంకర్లు సేఫ్ జోన్‌లో ఉంటే.. క్షేత్రస్థాయిలో విధులు నిర్వర్తిస్తున్న ఫీల్డ్ రిపోర్టర్లే ఆ ఆగ్రహానికి బలవు తున్నారు. తాజా పరిణామాలు దేశంలోని మీడియా వ్యవస్థపై తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి.

న్యూఢిల్లీ :ఈ నెల 18 నుంచి జంతర్‌మం తర్‌లో కొనసాగుతున్న సీజేపీ ఉద్య మాన్ని కవర్ చేయడానికి వెళ్లిన పలు టీవీ ఛానళ్ల విలేకరులు తీవ్ర ప్రతిఘటనను ఎదుర్కొన్నారు. “గోడీ మీడియా”, “దళాల్ మీడియా” అంటూ నిరసన కారులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కొన్నిచోట్ల తోపులాటలు, దాడులు కూడా జరిగాయి. అదే సమయంలో పలువురు నిరసనకారులు విలేకరులను హింస నుంచి రక్షించిన ఘటనలు కూడా చోటుచేసుకున్నాయి. ఎన్‌డీటీవీకి చెందిన ఓ మహిళా రిపోర్టర్ సోనం వాంగ్‌చుక్‌ను పోలీసులు అదుపులోకి తీసుకెళ్లిన ఘటనను ప్రత్యక్ష ప్రసారం చేశారు. ఆమె నిరసనకారుల అభిప్రాయాలతో పాటు పోలీసుల అధికారిక ప్రకటనను కూడా ప్రసారంలో పేర్కొనడంతో కొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత చేశారు. ఆ తర్వాత ఆమెకు సామాజిక మాధ్యమాల్లో తీవ్ర వేధింపులు, లైంగికదాడి, హత్య బెదిరింపులు వచ్చాయి. ఆమె తల్లిని కూడా ఇంటి సమీపంలో కొందరు నిలదీశారు.టైమ్స్ నౌ రిపోర్టర్ దేవ్ కొటక్‌పై కొందరు దాడి చేసి మొబైల్ ఫోన్, గడియారం, కళ్లద్దాలు లాక్కున్నట్టు ఆయన తెలిపారు. అయితే అదే గుంపులోని మరికొందరు నిరసనకారులు ఆయనను రక్షించి సురక్షిత ప్రాంతానికి చేర్చారు. “మీడియాపై కోపం ఉంది. కానీ ఇలా కొట్టడం తప్పు” అని వారు చెప్పిన వీడియోలు వైరల్ అయ్యాయి. ఏబీపీ న్యూస్ రిపోర్టర్ వరుణ్ భాసిన్‌ను కూడా నిరసనకారులు నిలదీశారు. “మా ఉద్యమాన్ని ఇన్ని రోజులు ఎందుకు చూపించలేదు?”, “ఇప్పుడు ఎందుకు వచ్చారు?” అని ప్రశ్నించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఆయన పోలీ సు వాహనంలోకి వెళ్లి బయటపడ్డారు. రిపబ్లిక్ టీవీ, టైమ్స్ నౌ, ఎన్‌డీటీవీకి చెందిన మరికొందరు విలేకరులు కూడా వ్యతిరేకతను, నిరసనను ఎదుర్కొన్నారు.

‘సమస్య రిపోర్టర్లు కాదు’
ఈ ఘటనల అనంతరం పలువురు సీనియర్ జర్నలిస్టులు ఓ ముఖ్యమైన అంశాన్ని ప్రస్తావించారు. వారి అభిప్రాయం ప్రకారం.. ప్రజల్లో ఉన్న అసలు అసంతృప్తి ఫీల్డ్‌లో వార్తలు సేకరించే రిపోర్టర్లపై కాదు, పాలక పక్షానికి అనుకూలంగా కథనాలను రూపొందిస్తున్న యాజమాన్యాలు, ఎడిటోరియల్ టీమ్‌లు, ప్రైమ్‌టైమ్ యాంకర్లపైనే. ఒక సీనియర్ జర్నలిస్టు మాట్లాడుతూ… “90 శాతం ఫీల్డ్ రిపోర్టర్లు నిజంగా జరిగినదే పంపిస్తారు. కానీ చివరికి ఏది ప్రసారం కావాలి, ఏ కోణంలో చూపించాలి అనేది న్యూస్‌రూమ్‌లో నిర్ణయమవుతుంది. ఆ నిర్ణయాలతో ఏర్పడిన వ్యతిరేకత ఇప్పుడు రిపోర్టర్లపై పడుతోంది” అని వ్యాఖ్యానించారు. మరో జర్నలిస్టు మాట్లాడుతూ… “టెలివిజన్ మీడియా సింహ భాగం పాలక పక్షానికి అను కూలంగా వ్యవహరించిందనే అభిప్రాయం ప్రజల్లో బలపడింది. అందుకే నిరసనల్లో ‘గోడీ మీడియా’ అనే నినాదం వినిపిస్తోంది. కానీ ఫీల్డ్ రిపోర్టర్లపై హింస సమస్యకు పరిష్కారం కాదు” అన్నారు.

నిరసనకారుల వాదన
నిరసనకారుల అభిప్రాయం ప్రకారం.. ప్రజా ఉద్యమాలను ప్రధాన స్రవంతి టెలివిజన్ మీడియా ఏండ్లుగా వక్రీకరించి చూపిందనీ, ప్రభుత్వానికి అసౌకర్యంగా, వ్యతిరేకంగా ఉండే అంశాలను విస్మరించి, దానికి అనుకూలంగా ఉండే కథనాలకు ప్రాధాన్యం ఇచ్చిందని ఆరోపిస్తున్నారు. ఈ కారణంగానే మీడియాపై తీవ్ర అవిశ్వాసం, ఆగ్రహం పెరిగిందనీ, నిరసనల సందర్భంగా ఇది కట్టలు తెంచుకుం దని వారు వివరిస్తున్నారు. నిరసనకారుల ఆగ్రహానికి కారణమైన అంశాలు మీడియా పక్షపాత ధోరణి, పాలక పక్షానికి అనుకూల కథనాలేనని పలువురు జర్నలిస్టులే అంగీక రిస్తున్నారు. అయితే అభిప్రాయ భేదాలు ఎంత తీవ్రమైనవైనా ఫీల్డ్ రిపోర్టర్లపై హింసకు పాల్ప డడం సమర్థనీయం కాదనీ, ఆ అసంతృప్తి అనేది ఎడిటోరియల్ విధానాలను నిర్ణయించే వారిపైనే కేంద్రీకృతం కావాలని పలువురు మేధావులు సూచిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -