Friday, July 24, 2026
E-PAPER
Homeఖమ్మంనారంవారిగూడెంలో జీపీ -సాప్ డేటా ఎంట్రీ విజయవంతం

నారంవారిగూడెంలో జీపీ -సాప్ డేటా ఎంట్రీ విజయవంతం

- Advertisement -

– గ్రామాభివృద్ధి ప్రణాళికల రూపకల్పనకు కీలక ముందడుగు
– సన్నాహక సమావేశానికి హాజరైన డీఆర్డీఏ ఏపీడీ ఎన్.రవి
నవతెలంగాణ – అశ్వారావుపేట

అశ్వారావుపేట మండలంలోని నారంవారిగూడెం గ్రామ పంచాయతీలో గ్రామ పంచాయతీ సమగ్ర అభివృద్ధి ప్రణాళిక (జీపీ-సాప్) పైలట్ డేటా ఎంట్రీ కార్యక్రమం గురువారం విజయవంతంగా నిర్వహించారు. రాష్ట్రంలో పైలట్ ప్రాజెక్టుగా ఎంపికైన మూడు గ్రామ పంచాయతీలలో నారంవారిగూడెం ఒకటిగా ఎంపిక కావడం విశేషం.

పంచాయతీ రాజ్ శాఖ నూతనంగా రూపొందించిన జీపీ-సాప్ సాఫ్ట్‌వేర్‌లో గ్రామ పంచాయతీకి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని నమోదు చేసే ప్రక్రియను చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని సర్పంచ్ మనుగొండ వెంకట రమణ అదనపు డీఆర్‌డీఏ అధికారి ఎన్. రవి, డీఎల్‌పీఓ ప్రభాకర్, వ్యవసాయ శాఖ ఏడీఏ పెంటేల రవికుమార్, ఎంపీడీఓ వాల్మీకి కిశోర్ పర్యవేక్షించగా, ఎంపీఓ రామకోటారెడ్డి ఆధ్వర్యంలో డేటా ఎంట్రీ నిర్వహించారు.

గ్రామ పంచాయతీ కార్యదర్శి నార్లపాటి జగదీష్ గ్రామానికి సంబంధించిన వివిధ అంశాల సమగ్ర సమాచారాన్ని సేకరించి సాఫ్ట్‌వేర్‌లో నమోదు చేశారు. ఈ సందర్భంగా జీపీ-సాప్ మాడ్యూల్ పనితీరు, డేటా నమోదు విధానం, సాంకేతిక అంశాలను పరీక్షించగా, సాఫ్ట్‌వేర్ సమర్థవంతంగా పనిచేసిందని అధికారులు తెలిపారు. ప్రాజెక్టు అమలుకు అవసరమైన అన్ని ప్రక్రియలు ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తయ్యాయని పేర్కొన్నారు.

గ్రామ స్థాయి అవసరాలను శాస్త్రీయంగా గుర్తించి, దీర్ఘకాలిక అభివృద్ధి ప్రణాళికలను రూపొందించడంలో జీపీ-సాప్ కీలక పాత్ర పోషించనుంది. పైలట్ కార్యక్రమంలో లభించిన అనుభవాలు భవిష్యత్తులో రాష్ట్రవ్యాప్తంగా ఈ విధానాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి ఉపయోగపడనున్నాయని అధికారులు అభిప్రాయపడ్డారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -