Saturday, July 25, 2026
E-PAPER
Homeమానవిబరువును తగ్గించే హెల్తీ ఫుడ్

బరువును తగ్గించే హెల్తీ ఫుడ్

- Advertisement -

బరువు తగ్గడంలో.. ఆహారం కీలకపాత్ర పోషిస్తుంది. హెల్తీగా బరువు తగ్గాలనుకున్నప్పుడు ప్రోటీన్, ఫైబర్, ఫ్యాట్స్, కార్బ్స్​ని కచ్చితంగా శరీరానికి అందించాలి. అయితే ఈ పోషకాలు కోసం మీరు ఎలాంటి ఫుడ్స్​ని ట్రై చేస్తే మంచిది. ప్రోటీన్​కు మంచి సోర్స్ ఏంటి? హెల్తీ కార్బ్స్​ వేటి నుంచి పొందవచ్చు. ఫ్యాట్స్​ని ఎలా తీసుకోవాలి? వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రోటీన్ కోసం..
ప్రోటీన్ హెల్తీగా బరువు తగ్గడంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. ఇది కండరాలను బిల్డ్ చేయడంలో సహాయం చేస్తుంది. దీనివల్ల బరువు తగ్గే సమయంలో మీకు మజిల్ లాస్ ఉండదు. అందుకే ప్రోటీన్ కోసం.. పనీర్, చియాసీడ్స్, శనగలు తీసుకోవచ్చు. వీటిలో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. అయితే నాన్​ వెజ్ తినేవారు చికెన్ తీసుకోవచ్చు. చికెన్ బ్రెస్ట్​లో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. ఎగ్స్​ కూడా హెల్తీ ప్రోటీన్ సోర్స్​గా తీసుకోవచ్చు.

ఫైబర్
శరీరాన్ని డీటాక్స్ చేసేందుకు.. లోపలున్న టాక్సిన్లను బయటకు పంపి.. మెటబాలీజం పెంచడంలో ఫైబర్ ముఖ్యపాత్ర పోషిస్తుంది. అందుకే మీ ప్రతీ మీల్​లో ఫైబర్ ఉండేలా చూసుకోవాలని చెప్తారు. అయితే ఓట్స్, చిలగడ దుంప, కిడ్నీ బీన్స్, ఫ్రూట్స్​లలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇవన్నీ శరీరంలోని టాక్సిన్లను బయటకు పంపి హెల్తీగా ఉండడంలో హెల్ప్ చేస్తాయి.

హెల్తీ ఫ్యాట్స్
ఫ్యాట్స్ తీసుకుంటే బరువు పెరిగిపోతా మనుకునేవారు గుర్తించాల్సిన విషయం ఏంటంటే ఫ్యాట్స్ రెండు రకాలు. అవి హెల్తీ ఫ్యాట్స్, అన్​ హెల్తీ ఫ్యాట్స్. ప్యాక్డ్, డీప్ ఫ్రై చేసిన స్పైసీ ఫుడ్ ద్వారా అన్​హెల్తీ ఫ్యాట్స్ వస్తాయి. ఇవి కొలెస్ట్రాల్ పెంచి.. గుండె సమస్యలను పెంచుతాయి. హెల్తీ ఫ్యాట్స్ అలా కాదు. ఇవి ఆరోగ్యానికి మేలు చేసి.. శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తాయి.

కార్బ్స్
కార్బ్స్ బరువు పెరిగేలా చేస్తాయి. అందుకని మొత్తానికి వాటిని దూరం చేయకూడదు. అ శరీరానికి అవసరమేనని గుర్తించాలి. అయితే వాటిని ఎక్కువ మోతాదులో కాకుండా తక్కువ మోతాదులో శరీరానికి అందించవచ్చు. ఆరోగ్యానికి మేలు చేస్తూ.. లో కార్బ్ డైట్ తీసుకోవాలనుకుంటే బ్రకోలీ, క్యాబేజీ, మష్రూమ్, కీరదోసలను కార్బ్ పోర్షన్​లో తీసుకోవచ్చు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -