Saturday, July 25, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయం60 దేశాలపై ట్రంప్ టారిఫ్‌లు

60 దేశాలపై ట్రంప్ టారిఫ్‌లు

- Advertisement -

భారత్‌కు స్వల్ప ఊరట..
వాషింగ్టన్ : వెట్టి చాకిరీ ద్వారా తయారుచేసిన వస్తువుల దిగుమతులపై సరైన నిషేధం అమలు చేయడం లేదనే ఆరోపణలతో అమెరికా సంచలన నిర్ణయం తీసుకుంది. భారత్ సహా దాదాపు 60 భాగస్వామ్య దేశాల నుంచి వచ్చే దిగుమతులపై 10 శాతం నుంచి 12.5 శాతం వరకు కొత్త సుంకాలను విధిస్తున్నట్టు అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. తాత్కాలికంగా విధించిన 10 శాతం గ్లోబల్ టారిఫ్‌ల గడువు శుక్రవారంతో ముగియనుండటంతో ట్రేడ్ యాక్ట్ 1974 లోని ‘సెక్షన్ 301’ ప్రకారం ఈ కఠినమైన సుంకాలను అమల్లోకి తెచ్చారు.
భారత్‌కు ఊరట..
ప్రారంభంలో భారత్‌పై 12.5 శాతం టారిఫ్ విధించాలని ప్రతిపాదించినప్పటికీ.. వెట్టి చాకిరీ నిరోధక చట్టాల అమలును భారత్ వేగవంతం చేయడంతో ఈ పన్నును 10 శాతానికి తగ్గించారు. చమురు, సహజ వాయువు, ఎరువుల దిగుమతులకు, అలాగే యూఎస్-మెక్సికో-కెనడా వాణిజ్య ఒప్పందం పరిధిలోకి వచ్చే వస్తువులకు ఈ పన్నుల నుంచి మినహాయింపు ఇచ్చారు.వివిధ దేశాలు తీసుకుంటున్న చర్యల ఆధారంగా ఈ సుంకాల శాతాన్ని నిర్ణయించారు. భారత్, బ్రిటన్, కెనడా, మెక్సికో, ఇండోనేషియా వంటి దేశాలకు 10 శాతం సుంకాన్ని వర్తింపజేయగా, చైనా సహా ఇతర 38 దేశాలకు 12.5 శాతం సుంకాన్ని ఖరారు చేశారు.ఇక ఈ సుంకాలపై యూఎస్ వాణిజ్య ప్రతినిధి జెమిసన్‌ గ్రీర్‌ మాట్లాడుతూ.. అమెరికాలో దాదాపు శతాబ్ద కాలంగా వెట్టిచాకిరిపై నిషేధం ఉందన్నారు. దీన్ని కఠినంగా అమలు చేస్తున్నామన్నారు. ఈ చర్య మానవ హక్కుల ఉల్లంఘనను సరిదిద్దడంతో పాటు, ప్రపంచవ్యాప్తంగా కార్మికుల సంక్షేమాన్ని మెరుగుపరచడానికి తోడ్పడుతుందని ఆయన పేర్కొన్నారు.అయితే, మునుపటి సుంకాల గడువు ముగిసే సమయానికే సరిగ్గా ఈ కొత్త సుంకాలను తీసుకురావడంపై వస్తున్న విమర్శలను అమెరికా అధికార యంత్రాంగం తోసిపుచ్చింది. ట్రంప్ తన వ్యాపార విధాన లక్ష్యాలను సాధించడానికి తన వద్ద ఉన్న అన్ని సాధనాలను ఎప్పుడూ ఉపయోగిస్తారని తెలిపింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -