Saturday, July 25, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంఅమెరికా కాల్పుల విరమణ ప్రతిపాదన.. ఇరాన్ నో

అమెరికా కాల్పుల విరమణ ప్రతిపాదన.. ఇరాన్ నో

- Advertisement -

హార్ముజ్ జలసంధి వివాదమే అడ్డంకి
ది న్యూయార్క్ టైమ్స్ కథనం
యూఎస్-ఇరాన్ ఘర్షణల మధ్య కొత్త పరిణామం?

వాషింగ్టన్, టెహ్రాన్ : అమెరికా ప్రతిపాదించిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇరాన్ తిరస్కరించినట్టు అమెరికా పత్రిక ది న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది. ఇరాక్ ప్రధాని అలీ అల్-జైదీ ద్వారా టెహ్రాన్‌కు చేరిన ఈ ప్రతిపాదనలో హార్ముజ్ జలసంధిపై నియంత్రణ అంశానికి పరిష్కారం లేకపోవడంతో దాన్ని అంగీకరించలేదని ఇరాన్, ఇరాక్ అధికారులను ఉటంకిస్తూ పేర్కొంది.
న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రకారం.. కాల్పుల విరమణకు సంబంధించిన అమెరికా ప్రతిపాదనను గురువారం ఇరాక్ ప్రధాని అలీ అల్-జైదీ ఇరాన్ నాయకత్వానికి అందించారు. అయితే ఆ ప్రతిపాదనలోని పూర్తి వివరాలు ఇప్పటివరకు అధికారికంగా వెల్లడి కాలేదు. ఇరాన్ అధికారుల ప్రకారం.. హార్ముజ్ జల సంధిపై నియంత్రణ, అక్కడ నెలకొన్న ఉద్రిక్తతలకు శాశ్వత పరిష్కారం లేకుండా కేవలం తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం చేసుకోవడంలో తమకు ఆసక్తి లేదని టెహ్రాన్ స్పష్టం చేసినట్టు సమాచారం. అయితే ఈ కథనంపై అమెరికా అధ్యక్ష కార్యాలయం (వైట్ హౌస్) నుంచి ఎలాంటి అధికారిక ప్రకటనా వెలువడలేదు.
రెండు వారాలుగా కొనసాగుతున్న ఘర్షణలు
దాదాపు రెండు వారాలుగా అమెరికా, ఇరాన్ మధ్య సైనిక ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. అమెరికా మళ్లీ నౌకాదళ దిగ్బంధనాన్ని అమలు చేసినప్పటికీ.. హార్ముజ్ జలసంధిలో నౌకలపై ఇరాన్ దాడులు కొనసాగిస్తున్నట్టు అమెరికా ఆరోపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ది న్యూయార్క్ టైమ్స్ కథనం చర్చనీయాంశంగా మారింది.
అమెరికాపై అరాగ్చీ విమర్శలు
ఐఆర్‌ఐబీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అరాగ్చీ మాట్లాడుతూ.. ప్రధాన సమస్య అమెరికా అవివేకపూరిత, అతి ఆధిపత్య ధోరణి అని విమర్శించారు. అమెరికా తన వైఖరిని మార్చుకోనంత వరకు సమస్యకు పరిష్కారం దొరకదని ఆయన అభిప్రాయపడ్డారు. మరోవైపు ట్రంప్ కూడా ఇరాన్‌పై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఒప్పందం చేసుకునే పరిస్థితిలో ఇరాన్ లేదని, అక్కడి నాయకత్వం ఇంకా దురుద్దేశాలతో వ్యవహరిస్తోందని ఆరోపించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -