నరికినకొద్ది విరగబూస్తాం.. విరగబూసి చరిత్రనే తిరగరాస్తాం
ఏ పార్టీ అధికారంలో ఉన్నా ప్రజల బతుకులు మారవు
సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ
నవతెలంగాణ- సంస్థాన్ నారాయణపురం
దోపిడి, అణిచివేతలు, అన్యాయానికి వ్యతిరేకంగా జరిగే పోరాటంలో ఎంతమంది అమరులైన అంతిమంగా విజయం సాధించే వరకు సీపీఐ(ఎం) పోరాటం కొనసాగిస్తామని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ అన్నారు. శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయ ణపురం మండలం పుట్టపాక సీపీఐ(ఎం) గ్రామ నాయకులు సుక్క అబ్బయ్య, మర్రి నర్సిరెడ్డి, నడికుడి శంకరయ్య, నడికుడి బచ్చయ్య 27వ వర్ధంతి సభను నాయకులు పిట్ట రాములు అధ్యక్షతన నిర్వహించారు. ముందుగా అమర వీరుల స్మారక భవనంపై పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం అమరవీరుల చిత్రపటాలకు పలువురు నాయకులతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సంద ర్భంగా జాన్‌వెస్లీ మాట్లాడుతూ.. సీపీఐ(ఎం) నాయకత్వాన జరుగుతున్న పోరాటాన్ని మరింత బలోపేతం చేయడానికి కృషి చేసిన ఈ నలుగురి నాయకులను చంపడం దుర్మార్గమైన చర్య అని అన్నారు. ప్రజల తరఫున పోరాడే వారిని చంపితే ఎర్రజెండా ఉద్యమం ఆగుతుందనుకోవడం వారి అవివేకమేనని తెలిపారు. నరికిన కొద్దీ విరగభూసి చరిత్రనే తిరగరాస్తాం అని హెచ్చరించారు. సీపీఐ(ఎం) ఇప్పటికే దేశవ్యాప్తంగా భూస్వామ్య,పెట్టుబడుదారి విధానానికి వ్యతిరేకంగా, అసమానతలు లేని సమాజ నిర్మాణం కోసం పోరాడుతుందన్నారు. అందరూ ఆత్మగౌరవంతో బతకాలన్నా, అసమానతలు లేని సమాజం రావాలన్నా అది సోషలిస్టు విధానంతోనే సాధ్యమన్నారు. పెట్టుబడిదారీ, దోపిడీ వర్గాలు, భూస్వామ్య విధానాలు అవలంబించే ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ప్రజల బతుకులు మారవని అన్నారు. పాలక వర్గాలు అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా పోరాటంలో ఎంతో మంది ప్రజా నాయకులు ప్రాణాలర్పించారన్నారు. అందులో పుట్టపాక అమరవీరులు ఉన్నారన్నారు. 27 ఏండ్ల నుంచి అమరుల యాదిలో సంస్కరణ సభలు నిర్వహిస్తున్నందుకు పార్టీ గ్రామ శాఖ నాయకులను, రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తున్నందుకు ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ నాయకులను, అందుకు అన్ని విధాల సహకారం అందిస్తున్న మర్రి నర్సిరెడ్డి కుటుంబ సభ్యులను పార్టీ రాష్ట్ర కమిటీ తరఫున అభినందించారు.
కేంద్ర మంత్రి రాజీనామా చేయాలి
పేపర్ లీకేజీ వల్ల నీట్ పరీక్షలు రద్దు చేయడంతో 22 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్ నాశనమైందని జాన్‌వెస్లీ అన్నారు. తిరిగి శిక్షణ పొంది పరీక్షలు రాసే ఆర్థిక స్థోమత లేక 20 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పాలక విధానాలకు వ్యతిరేకంగా యువత స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున ఢిల్లీ నగరంలో ఆందోళన చేపడుతుంటే పోలీసులతో కొట్టించడం సరికాదన్నారు.
ఇది ప్రజాస్వామ్యానికి విఘాతమన్నారు. విద్యార్థుల న్యాయ పోరాటానికి సీపీఐ(ఎం) సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు. యువతకు ప్రతియేటా 2 కోట్ల చొప్పున ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పి 12 ఏండ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం 40 లక్షల ఉద్యోగులను తొలగించిందన్నారు. విద్యుత్ సవరణ బిల్లును తెచ్చి రైతులను వ్యవసాయానికి దూరం చేసే కుట్ర చేస్తుందని తెలిపారు. ఇప్పటికే కార్మికుల హక్కులను కాలరాసే చట్టాలను రద్దు చేసిందన్నారు. ఉపాధి హామీ చట్టం పేరు మార్చి నిధుల కోత పెట్టిందన్నారు. ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. అంతకుముందు
యాదాద్రి భువనగిరి జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలి
యాదాద్రి భువనగిరి జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండీ జహంగీర్ డిమాండ్ చేశారు. జిల్లా రైతాంగానికి సాగు నీటి వసతి కల్పించేందుకు చేపట్టిన ప్రాజెక్టులను పూర్తిచేయడంలో ఐదుగురు ఎమ్మెల్యేలు, ఎంపీ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు గుంటూజు శ్రీనివాసచారి, బూరుగు కృష్ణారెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు మల్లేపల్లి లలిత, ఎండీ పాషా, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు దోనూరు నర్సిరెడ్డి, మండల కార్యదర్శి దొడ యాదిరెడ్డి, సీనియర్ నాయకులు సుర్కంటి శ్రీనివాసరెడ్డి, దంత గోని పెద్దలు, తుమ్మల నర్సిరెడ్డి, మాజీ ఎంపీటీసీ మర్రి వసంత, మునగాల మండల నాయకులు బుర్రి శ్రీరాములు, మునుగోడు నాయకులు చాపల మారయ్య, పీఎన్ఎం జిల్లా కార్యదర్శి ఈర్లపల్లి ముత్యాలు తదితరులు పాల్గొన్నారు.
అంతిమ విజయం ఎర్ర జెండాదే
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



