అమెరికా ప్రతినిధుల సభ తీర్మానం
డెమోక్రాట్లకు నలుగురు రిపబ్లికన్ల మద్దతు
ఇది ట్రంప్‌నకు రాజకీయ సందేశం : డెమోక్రాట్లు
వాషింగ్టన్ : ఇరాన్‌పై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చేపడుతున్న సైనిక చర్యలను నియంత్రించాలంటూ అమెరికా ప్రతినిధుల సభ (హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్) కీలక తీర్మానాన్ని ఆమోదించింది. డెమోక్రాట్లకు నలుగురు రిపబ్లికన్ సభ్యులు కూడా మద్దతు ఇవ్వడంతో ఈ తీర్మానం 214-208 ఓట్ల తేడాతో ఆమోదం పొందింది. అయితే అదే అంశంపై సెనేట్‌లో ప్రవేశపెట్టిన తీర్మానం అవసరమైన మద్దతు లభించక వీగిపోయింది. అమెరికా-ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం విఫలమైన తర్వాత యుద్ధం మళ్లీ తీవ్రరూపం దాల్చిన నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది.
ఇటీవల జోర్డాన్‌లోని అమెరికా సైనిక స్థావరంపై జరిగిన ఇరాన్ దాడిలో ముగ్గురు అమెరికా సైనికులు మరణించిన నేపథ్యంలో అమెరికా-ఇరాన్ ఘర్షణ మరింత ముదిరింది. ఈ పరిస్థితుల్లో అధ్యక్షుడు ట్రంప్ యుద్ధ అధికారాలను పరిమితం చేయాలన్న డిమాండ్ మళ్లీ ఊపందుకుంది.
డెమోక్రాట్ల సందేశం
తాజా తీర్మానం చట్టపరంగా పెద్దగా ప్రభావం చూపకపోయినా.. ట్రంప్ యుద్ధ విధానాన్ని కాంగ్రెస్‌లోని పలువురు సభ్యులు వ్యతిరేకిస్తున్నారనే బలమైన రాజకీయ సందేశాన్ని ఇది ఇస్తుందని డెమోక్రాట్లు అన్నారు. కాల్పుల విరమణ విఫలమైన తర్వాత అమెరికా, ఇరాన్ మధ్య వరుసగా 12 రోజుల పాటు దాడులు కొనసాగుతున్నాయని, పరిస్థితి మరింత ప్రమాదకర దశకు చేరుతోందని వారు హెచ్చరించారు.
ప్రతినిధుల సభలో గురువారం జరిగిన ఓటింగ్‌లో తీర్మానానికి 214 మంది సభ్యులు మద్దతు ఇవ్వగా, 208 మంది వ్యతిరేకించారు. డెమోక్రాట్లతో పాటు నలుగురు రిపబ్లికన్ సభ్యులు కూడా తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశారు. అయితే కొద్దిసేపటికే సెనేట్‌లో జరిగిన ఓటింగ్‌లో తీర్మానం 47-49 ఓట్ల తేడాతో తిరస్కరణకు గురైంది. గతంలో ఇలాంటి తీర్మానానికి మద్దతు తెలిపిన ఇద్దరు రిపబ్లికన్ సెనేటర్లు ఈసారి ఓటింగ్‌కు దూరంగా ఉండటం గమనార్హం. జూన్‌లో కూడా హౌస్, సెనేట్ రెండూ ట్రంప్ కాంగ్రెస్ అనుమతి లేకుండా ఇరాన్‌పై మరిన్ని దాడులు చేపట్టరాదని పేర్కొంటూ ఒక తీర్మానాన్ని ఆమోదించాయి. అయితే అది ‘కాంకరెంట్ రిజల్యూషన’ రూపంలో ఉండటంతో అధ్యక్షుడి ఆమోదం కోసం వైట్ హౌస్‌కు పంపలేదు.
‘యుద్ధం ముగియాలి’
ప్రతినిధుల సభ సభ్యురాలు ప్రమీలా జయపాల్ మాట్లాడుతూ.. “అమెరికా ప్రజలకు సరైనది చేయడానికి మనం ధైర్యంగా ముందుకు రావాలి. యుద్ధంపై నిర్ణయం తీసుకునే అధికారాన్ని కాంగ్రెస్ మళ్లీ తన చేతుల్లోకి తీసుకుంటోందని అధ్యక్షుడికి స్పష్టమైన సందేశం ఇవ్వాల్సిన అవసరం ఉంది” అని అన్నారు. “ఈ యుద్ధం ముగియాలి” అని ఆమె సభలో తెలిపారు.
ఇరాన్‌పై సైనిక చర్యలను నియంత్రించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



