Saturday, July 25, 2026
E-PAPER
Homeఆదిలాబాద్1/70 పరిరక్షణ కోసం టీఏజీఎస్ ఉద్యమిస్తోంది

1/70 పరిరక్షణ కోసం టీఏజీఎస్ ఉద్యమిస్తోంది

- Advertisement -

నవతెలంగాణ-ఆదిలాబాద్ టౌన్
1/70 పరిరక్షణ కోసం తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం ఉద్యమిస్తోందని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు ఉయిక విష్ణు అన్నారు. శనివారం ఉట్నూర్ పట్టణంలోని సంఘం కార్యాక్రమంలో సమావేశం నిర్వహించి మాట్లాడారు. 1/70ని సవరించాలని నాన్ ట్రైబ్స్ 750 పైగా మంది సుప్రీంకోర్టులో కేసు వేశారన్నారు. దీనికి వ్యతిరేకంగా 1/70ని కాపాడేందుకు గిరిజన సంఘం ఆధ్వర్యంలో సుప్రీం కోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసి అన్ని ఆధారాలు అందజేశామన్నారు. షెడ్యూల్ ప్రాంతంలోని 1/70ని కాపాడేందుకు తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం పోరాటాలు నిర్వహిస్తుందని, దీనికి మేధావులు, ఉద్యోగులు, ఆదివాసులు మద్దతు పలకాలని కోరారు.

కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత గిరిజన చట్టాలను, గిరిజన హక్కులను పూర్తిగా నిర్వీర్యం చేసే విధంగా దాని విధానాలు అమలు చేస్తుందని విమర్శించారు. 1/70ని సవరించాలని నాన్ ట్రైబల్ సుప్రీం కోర్టుకు వెళితే కనీసం రిట్ పిటిషన్ దాఖలు చేసి దాన్ని కాపాడాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందన్నారు. అయినా ఇప్పటివరకు రిట్ పిటిషన్ దాఖలు చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నాయని విమర్శించారు. ఆదివాసీ చట్టాలు, హక్కులు బిజెపి వచ్చాక పూర్తిగా నిర్వీర్యం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో గిరిజన  ప్రాంతంలో ఆదివాసి యువతకు ఉద్యోగాలలో 100% రిజర్వేషన్ కల్పించే జీవో నంబర్ 3 అలాగే నిర్లక్ష్యం చేసి ఆదివాసి నిరుద్యోగులకు యువతకు అన్యాయం చేసిన పరిస్థితి ఉందన్నారు.

ప్రభుత్వం తక్షణమే సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేయాలని, ప్రభుత్వం నుండి వాదనలు బలంగా వినిపించాలని డిమాండ్ చేశారు. సంఘ పరంగా కూడా రిట్ పిటిషన్ దాఖలు చేసి దాన్ని కాపాడేందుకు కచ్చితమైన ఆధారాలను సుప్రీంకోర్టుకు అందజేస్తామని వెల్లడించారు. ఆదివాసి సంఘాల ఐక్యంగా వన్నఫ్ సెవెంటీ సవరణకు వ్యతిరేకంగా పోరాటానికే సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ న్యాయమైన పోరాటానికి అందరూ సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో సంఘ నాయకులు కోరేంగా యశ్వంత్, పవన్, రాజశేఖర్, దాంస్వావ్, రమేష్ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -