- Advertisement -
చెవినొప్పి
పేషెంట్ : చుక్కలమందు పనిచెయ్యడం లేదని మూడు రోజుల క్రితం మీ దగ్గరకు వస్తే…చుక్కల మందుకు బదులు మాత్రలు వాడమని చెప్పారు కదా…! అవి వాడాక చెవినొప్పి ఎక్కువైంది
డాక్టర్ :అలా జరగడానికి వీల్లేదే.. రోజుకు ఎన్ని మాత్రలు వాడావు…?
పేషెంట్ : రెండే. ఈ చెవిలో ఒకటి, ఆ చెవిలో ఒకటి వేసుకున్నా అంతే డాక్టర్.
సినిమా యాడ్స్
టీచర్: ఏంట్రా రవీ! తలనొప్పి, రొంప, దగ్గు అని బడి ఎగ్గొట్టి సినిమాకు వెళ్ళావట?
గోపీ : అవునండీ. సినిమా యాడ్స్‌లో ఏ మందు వేసుకోవాలో చూపిస్తారని.
ఇంటి కుక్క
టీచర్: నేను నీకు రెండు కుక్కలు, మరి రెండు కుక్కలు, మళ్ళీ రెండు కుక్కలు ఇచ్చాననుకో. నీ దగ్గర మొత్తం ఎన్ని కుక్కలు ఉంటాయి?
సంతోష్: ఏడు.
టీచర్: కాదు. ఇప్పుడు చెప్పు. నీకు నేను మొదట రెండు నారింజ పళ్ళు, మరి రెండు నారింజ పళ్ళు, మళ్ళీ రెండు నారింజ పళ్ళు ఇచ్చాననుకో. మొత్తం నీ దగ్గర ఎన్ని నారింజ పళ్ళుంటాయి?
సంతోష్: ఆరు!
టీచర్: గుడ్. ఇప్పుడు చెప్పు. నేను నీకు రెండు కుక్కలు, మరి రెండు కుక్కలు, ఇంకా రెండు కుక్కలు ఇచ్చాననుకో. మొత్తం నీ దగ్గర ఎన్ని కుక్కలు ఉంటాయి?
సంతోష్: ఏడు.
టీచర్: రెండేసి కుక్కలు మూడు ఒకటిగా కలిపితే ఏడెలా అవుతాయి బాబూ?
సంతోష్: ఇప్పటికే ఇంటిదగ్గర నాకు ఒక కుక్క ఉంది కదా టీచర్!
వెధవ
సునీల్: ఏరా.. నువ్వు ఎప్పుడూ వెధవలాగే మాట్లాడుతుంటావెందుకురా?
అనిల్: అలాగయితేనే నీకు బాగా అర్థమవుతుందనీ..
దారి చూపే దేవతలు
వరుణ్: చీమలను ఎందుకురా ఫాలో అవుతున్నావు?
వాసు: స్వీట్ పాకెట్‌ను అమ్మ దాపెట్టేసిందిరా. చీమల బారును అనుసరిస్తే స్వీట్ దగ్గరకి అవే తీసుకుపోతాయిగా అందుకని.
- Advertisement -



