- Advertisement -
నవతెలంగాణ-సత్తుపల్లి
సత్తుపల్లి మండలం బేతుపల్లిలో ఇటీవల మరణించిన కొప్పుల చెన్నారావు దశదిన కర్మ కార్యక్రమం ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. చెన్నారావు చిత్రపటంపై పూలు జల్లి శ్రద్ధాంజలి ఘటించారు. ఆయన పవిత్రాత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులకు సానుభూతిని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు చల్లగుళ్ల నరసింహారావు, శివా సత్యనారాయణమూర్తి (వేణు), వెల్ది జగన్మోహనరావు పాల్గొన్నారు.
- Advertisement -



