Sunday, July 26, 2026
E-PAPER
Homeఖమ్మంబూత్ లెవెల్ ఏజెంట్లే పార్టీకి 'వెన్నెముక'

బూత్ లెవెల్ ఏజెంట్లే పార్టీకి ‘వెన్నెముక’

- Advertisement -

– రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయకుమార్
– ‘బీఎల్ఏ’ లతో డాక్టర్ దయానంద్ సమావేశం
నవతెలంగాణ-సత్తుపల్లి 

బూత్ లెవెల్ ఏజెంట్లు (బీఎల్ఏ) పార్టీకి వెన్నెముక అని రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయకుమార్ అన్నారు. ఆదివారం స్థానిక ద్వారకాపురిలోని ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ అధికారిక క్యాంపు కార్యాలయంలో డాక్టర్ దయానంద్  బీఎల్ఏలతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో బీఎల్ఏలకు, కాంగ్రెస్ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ప్రజా సంక్షేమం, పార్టీ బలోపేతమే ధ్యేయంగా నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయాలని కోరార. ప్రతి ఏజెంట్ తమ  పరిధిలోని ఓటర్లతో మమేకమవుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా బూత్ లెవెల్ ఏజెంట్లు చొరవ చూపాలని స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో పార్టీ కార్యక్రమాలను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. స్థానిక నాయకులు, ఏజెంట్లు సమన్వయంతో పనిచేసి పార్టీని బలోపేతం చేయాలన్నారు. ఈ సమావేశంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గాదె చెన్నకేశవరావు, ఏఎంసీ చైర్మన్ దోమ ఆనంద్ బాబు, నాయకులు మొహమ్మద్ కమల్ పాషా, కౌన్సిలర్లు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -