Sunday, July 26, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మేడిపల్లి టోల్ గేట్ వద్ద సౌకర్యాలు నిల్.!

మేడిపల్లి టోల్ గేట్ వద్ద సౌకర్యాలు నిల్.!

- Advertisement -

తక్షణమే వసతులు కల్పించకపోతే టోల్ ప్లాజా ముట్టడిస్తాం
కుల సంఘాల జేఏసీ జిల్లా చైర్మన్ పీక కిరణ్ హెచ్చరిక
నవతెలంగాణ – మల్హర్ రావు

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం-మల్హర్ మండలాల సరిహద్దుల్లో ప్రధాన రోడ్డుపై మేడిపల్లి వద్ద ఉన్న టోల్ ప్లాజా ప్రయాణికుల నుంచి ముక్కుపిండి టోల్ రుసుము వసూలు చేస్తోందే తప్ప, కనీస మానవతా దృక్పథంతో ఉచిత వసతులు కల్పించడంలో పూర్తిగా విఫలమైందని కుల సంఘాల జేఏసీ జిల్లా చైర్మన్ పీక కిరణ్,కోకన్వీనర్ ఐత బాపు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. టోల్ మేనేజ్‌మెంట్ అదేవిధంగా  అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.నిబంధనల ప్రకారం టోల్ ప్లాజా వద్ద ఉచిత బాత్రూమ్‌లు, తాగునీరు,విశ్రాంతి గదులు, ప్రథమ చికిత్స కేంద్రం ఉండాలి.

కానీ ఇక్కడ ఒక్క అంబులెన్స్ పడేసి చేతులుదులుపుకున్నారని తెలిపారు. బాత్రూమ్ వసతి కూడా లేకపోవడంతో నిత్యం ప్రయాణించే మహిళలు, చిన్న పిల్లలు, వయోవృద్ధులు పడుతున్న నరకయాతన వర్ణనాతీతమన్నారు. జేబులు నింపుకోవడంలో ఉన్న శ్రద్ధ.. ప్రజల అవసర తీర్చడంలో ఏమైందని?” ప్రశ్నించారు.​టోల్ వసూలు చేస్తున్నారంటే రోడ్డు అద్దంలా ఉండాలి. కానీ మేడిపల్లి టోల్ గేట్ పరిసరాల్లో రహదారి చూస్తే పెద్ద పెద్ద గుంతలతో మరణమృదంగం వాయిస్తోందని, నడుములు విరిగేలా ఉన్న గుంతల రోడ్డుపై ఏ హక్కుతో ప్రయాణికుల వద్ద డబ్బులు లాక్కుంటున్నారో చెప్పాలన్నారు? ఇది సురక్షిత ప్రయాణం కోసం కట్టే ఫీజా.. లేక ప్రమాదాలు కొనితెచ్చుకోవడానికి చెల్లించే కప్పమా?”

​రూల్స్ పాటించని టోల్ నిర్వాహకులు:
“టోల్ ప్లాజా అంటే కేవలం కౌంటర్ పెట్టి డబ్బులు వసూలు చేయడం కాదు. ప్రయాణికులకు సకల సౌకర్యాలు కల్పించడం నిర్వాహకుల బాధ్యత.ఎన్.హెచ్.ఏ.ఐ నిబంధనలను కనీసం పట్టించుకోకుండా, ప్రజల సొమ్మును దర్జాగా జేబులో వేసుకుంటూ ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని తెలిపారు.

​మేడిపల్లి టోల్ గేట్ వద్ద తక్షణమే రోడ్డుకు గుంతల మరమ్మతులు చేపట్టాలని, మహిళలకు, ప్రయాణికులకు ఉపయోగపడేలా శుభ్రమైన ఉచిత టాయిలెట్లు, మంచినీటి సదుపాయాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.అధికారులు, నిర్వాహకులు ఇప్పటికైనా స్పందించి వసతులు కల్పించకపోతే, కుల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో బాధితులు, వాహనదారులతో కలిసి మేడిపల్లి టోల్ ప్లాజాను ముట్టడిస్తామని హెచ్చరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -