Sunday, July 26, 2026
E-PAPER
Homeఖమ్మంఆవుల 'పోతురాజు'కు 'స్నిగ్ధారెడ్డి బాలసాహిత్య పురస్కారం'

ఆవుల ‘పోతురాజు’కు ‘స్నిగ్ధారెడ్డి బాలసాహిత్య పురస్కారం’

- Advertisement -

నవతెలంగాణ-సత్తుపల్లి 
హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో ఆదివారం జరిగిన తెలుగు సాహితీ వనం 9వ వార్షికోత్సవంలో సత్తుపల్లికి చెందిన బాలసాహిత్య రచయిత ఆవుల పోతురాజు ‘స్నిగ్ధారెడ్డి బాలసాహిత్య’  పురస్కారాన్ని అందుకున్నారు. తెలుగు  సాహితీ వనం నిర్వాహకులు శాంతికృష్ణ అధ్యక్షతన ఈ వేడుకలో‌ డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి, డాక్టర్ అంపశయ్య నవీన్, డాక్టర్ పెద్దింటి అశోక్ కుమార్ పాల్గొన్న ఈ సభలో  అతిథులు పోతురాజును అభినందిస్తూ మాట్లాడారు. పేద కుటుంబంలో జన్మించిన పోతురాజు బాల సాహిత్యంలో చేస్తున్న కృషిని అతిథులు కొనియాడారు. అతని చదువు నిమిత్తం అప్పటికప్పుడే రూ.12వేలు ఆర్థిక సహాయాన్ని అందజేశారు.

పోతురాజులోని ప్రతిభను గుర్తించి ప్రోత్సహించిన తెలుగు టీచర్ రమాదేవిని ఈ సందర్భంగా అభినందించారు. రవీంద్ర భారతిలో పురస్కారం అందుకున్న పోతురాజును సత్తుపల్లిలోని పలు స్వచ్ఛంద సంస్థలు, ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు. సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్, ఆషా స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్ డాక్టర్ మట్టా దయానంద్ విజయకుమార్, గార్లపాటి-బొల్లేపల్లి ట్రస్ట్ నిర్వాహకులు రామకృష్ణ, మధుసూధనరాజు, సృజన సంస్థ నిర్వాహకులు గట్టే, వాసు, ఆడమ్స్, పసుపులేటి నాగేశ్వరరావు, అయ్యదేవర శేషగిరిరావు, మాదిరాజు మాలతి, విశ్రాంత ఉద్యోగుల సంఘ నాయకులు కేశవరెడ్డి, ప్రకాశరావు, రామిశెట్టి సుబ్బారావు, డి కృష్ణయ్య,  నరసయ్య, బూరుగు దాసు పోతురాజుకు అభినందనలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -