- Advertisement -
అభినందించిన ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు
నవతెలంగాణ-మద్నూర్
మండల కేంద్రంలోని పాత బస్టాండ్ సమీపంలో ప్రయాణికుల సౌకర్యార్ధం సర్పంచ్ ఉషా సంతోష్ మేస్త్రీ ప్రత్యేకంగా సామూహిక మరుగుదొడ్ల నిర్మాణాలను చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు ఆదివారం హాజరై ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ప్రయాణికులు, ముఖ్యంగా మహిళలను దృష్టిలో ఉంచుకుని సర్పంచ్ సామూహిక మరుగుదొడ్లు నిర్మించడం అభినందనీయమన్నారు. అనంతరం ఎమ్మెల్యేను సర్పంచ్ శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఉపసర్పంచ్ రమేష్, పంచాయతీ వారి సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మండల సర్పంచులు, స్థానిక ప్రజలు అధికారులు పాల్గొన్నారు.
- Advertisement -



