- Advertisement -
నవతెలంగాణ-మద్నూర్
తొలి ఏకాదశిని పురస్కరించుకొని మద్నూర్ మండల కేంద్రంలో గల విఠలేశ్వర ఆలయంలో ఆదివారం ఆలయ పూజారి వెంకట మహారాజ్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకట్ మహారాజ్ మాట్లాడుతూ.. తొలి ఏకాదశి ఉపవాస దీక్షలు చేపట్టిన భక్తులు ద్వాదశి రోజున ఆదివారం ఉపవాస దీక్షలు విరమింపజేయడానికి ఈ అన్నదాన కార్యక్రమం చేపట్టామని తెలిపారు. ఉపవాస దీక్షలతో భక్తులు విఠలేశ్వర ఆలయాన్ని సందర్శించి, ఆదివారం ఉపవాస దీక్షలు విరమింప చేసేందుకు భక్తులు అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు.
- Advertisement -



