Monday, July 27, 2026
E-PAPER
Homeదర్వాజగునుగుపూలు పుస్తకావిష్కరణ

గునుగుపూలు పుస్తకావిష్కరణ

- Advertisement -

జూపాక సుభద్ర ఆత్మకథనమ్ గునుగుపూలు పుస్తకావిష్కరణ రవీంద్ర భారతి మినీ కాన్ఫరెన్స్ హాల్ లో ఈ రోజు సాయంత్రం 6 గంటలకు జరుగుతుంది. ఈ సభలో డా.పసునూరి రవీందర్, బెల్లంపల్లి దుర్గక్క, బాణాల సాలమ్మ, డా.తాళ్లపల్లి యాకమ్మ, డా.జిలుకర శ్రీనివాస్, డా.కోట విజయ, ప్రొఫెసర్ మారోజు దేవేంద్ర, దుర్గం రవీందర్, రచన ముద్రబోయిన , స్కై బాబా, డా.సిద్దెంకి యాదగిరి, డా.పొల్లాన బాలయ్య, కృపాకర్ మాదిగ పాల్గొంటారు.

దేశ భవితకు అండగా 29న కవితా పఠనం
ఈ నెల 29న సాయంత్రం 6 గంటలకు ఉస్మానియా విశ్వ విద్యాలయం, ఆర్ట్స్ కాలేజలో తెలంగాణ సాహితి హైదరాబాద్ నగర కమిటీ ఆధ్వర్యంలో దేశ భవితకు అండగా కవితా పఠనం జరుగుతుంది.
-తెలంగాణ సాహితి, 7386046936

29న ఎన్నీల ముచ్చట్లు – పుస్తకావిష్కరణ
తెలంగాణ రచయితల వేదిక (తె.ర.వే.) ఆధ్వర్యంలో ఈ నెల 29న సాయంత్రం కరీంనగర్ లోని ఫిలిమ్ భవన్ లో 160వ ఎన్నీల ముచ్చట్లు-కవితాగానం కార్యక్రమం జరుగనుంది. ఈ సందర్భంగా ఒంటెల భూంరెడ్డి (విజయశ్రీ) కవితా సంపుటి ‘అమృతపద కుసుమాలు’ ను భూర్ల వెంకటేశ్వర్లు ఆవిష్కరిస్తారు. దామరకుంట శంకరయ్య ఈ కవితాసంపుటిని సమీక్షిస్తారు. కవులు కవితా గానం చేస్తారు.
-సీ వీ కుమార్.

‘రంగులూ, ఫిరంగులూ’ పుస్తకావిష్కరణ
రావిశాస్త్రిగారి రచనల్లో ఎంపిక చేసిన వచనఖండికలతో ఎ.వి. రమణమూర్తి సంకలనం చేసిన ‘రాచకొండ విశ్వనాథశాస్త్రి: రంగులూ, ఫిరంగులూ’ అనే పుస్తకాన్ని జులై 30న ప్రెస్ క్లబ్, బషీర్‌బాగ్, హైదరాబాద్‌లో సాయంత్రం 6 గంటలకు జరిగే సభలో ‘మనసు’ రాయుడు ఆవిష్కరిస్తారు. ఈ సభలో వాసిరెడ్డి నవీన్, మృణాళిని, ఎన్. వేణుగోపాల్, జి.ఎస్. చలం ప్రసంగిస్తారు.
-ఎ. వి. రమణమూర్తి, 9866022150

‘సినారె సాహిత్య పురస్కార ప్రదానం
తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో మహాకవి సినారె కళాపీఠం, సాహిత్య సాంస్కృతిక సామాజిక సేవాసంస్థ నిర్వహిస్తున్న సినారె సాహిత్య పురస్కార ప్రదానం ఆగస్టు 2న ఉదయం 10 గంటలకు సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో జరుగుతుంది. ఈ పురస్కారాన్ని ఆచార్య మసన చెన్నప్ప, ఆచార్య బన్న అయిలయ్య, డాక్టర్ ప్రభాకర్ జైనీ, డాక్టర్ కొండపల్లి నీహారిణి, కోటం చంద్రశేఖర్, ధూళిపాళ అరుణ, డాక్టర్ రాధేయ, ఆచార్య కోయి కోటేశ్వరరావు, డాక్టర్ చెమన్ సింగ్, డాక్టర్ పసునూరి శ్రీధర్ బాబు, నామాల రవీంద్రసూరి లకు అందజేస్తారు.
-మల్లెకేడి రాములు, అధ్యక్షులు.

రెండు తరాల కవిసంగమం
రెండు తరాల కవిసంగమం – సీజన్ :2, సిరీస్ 46 ఆగస్ట్ 8న సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ కోటిలోని శ్రీకృష్ణదేవరాయ తెలుగు భాషా నిలయంలో జరుగుతుంది. ప్రొఫెసర్ బెల్లి యాదయ్య, రోహిణి వంజారి, జాబేర్ పాషా, ప్రమోద్ వడ్లకొండ, ఎస్.ఎస్.తరుణ్ పాల్గొంటారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -