కళాశాల ప్రిన్సిపల్ గోపాల్
నవతెలంగాణ-అచ్చంపేట
ప్రభుత్వ డిగ్రీ కళాశాల అమ్రాబాద్ లో 2026- 27 విద్యా సంవత్సరం నుండి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వారి సౌజన్యంతో ఓపెన్ యూనివర్సిటీ స్టడీ సెంటర్ (244) ను ఏర్పాటు చేసినట్లు కళాశాల ప్రిన్సిపల్ కె.గోపాల్ సోమవారం తెలిపారు. ఈ విద్యా సంవత్సరానికి బిఎ, బికాం, బిఎస్సీ గ్రూపులలో అడ్మిషన్లు స్వీకరిస్తున్నారు. డా. బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో చేరాలంటే ఇంటర్మీడియేట్, ఓపెన్ ఇంటర్, 10+2, పాలిటెక్నిక్, ఐటిఐ రెండు సంవత్సరాలు ఉత్తీర్ణులైన విద్యార్థులు అడ్మిషన్ తీసుకోవచ్చన్నారు.
విద్యార్థులు ఆధార్ కార్డు , ఎస్సెస్సీ, ఇంటర్ మార్కుల జాబితా , కమ్యూనిటీ సర్టిఫికెట్ , పాస్ ఫోర్టు సైజ్ ఫోటోతో ప్రభుత్వ డిగ్రీ కళాశాల అమ్రాబాద్ యందు గల ఓపెన్ యూనివర్సిటీ స్టడీ సెంటర్(244) కు వచ్చి అడ్మిషన్ పొందగలరని, అడ్మిషన్ల గడువు ఆగస్టు 7 చివరి తేది అని తెలిపారు. మరిన్ని వివరాలకోసం www.braouonline.in, admission registration వెబ్ సైట్లో login అయి దరఖాస్తు చేసుకున్న తరువాత మీరు ఎంచుకున్న స్టడీ సెంటర్లో సంప్రదించాలన్నారు. వివరాల కోసం టోల్ ఫ్రి నంబర్స్ 18005990101, 04023680333, 04023680444, 04023680555 కు ఫోన్ చేయవచ్చాన్నారు.



