నవతెలంగాణ-రాజోలి
రాజోలి మండల కేంద్రంలోని విద్యార్థినిలు మరియు విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై తాసిల్దార్ రామ్మోహన్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కెవిపిఎస్ సంఘం ఆధ్వర్యంలో హాస్టల్లో మరియు స్కూలు చదువుచున్న విద్యార్థులు విద్యార్థినిల సమస్యల పైన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అందులో రాజోలి మండల కేంద్రంలో సర్వే చేయడం జరిగింది. కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు ఆర్ విజయకుమార్ మాట్లాడుతూ.. మరి ముఖ్యంగా రాజోలి కేంద్రంలోని కస్తూర్బా స్కూల్లో దాదాపుగా 300 మంది పైగా బాలికలు చదువుతున్నారు.
ఈ బాలికలకు స్నానం చేయడానికి టాయిలెట్ వెళ్లడానికి నాలుగు గదులు మాత్రమే ఉన్నాయి. బాలికలు టాయిలెట్ కి వెళ్లాలంటే ఎంతో ఇబ్బందికరంగా కష్టంగా ఉంది ఈ బాధ బాలికలకు చాలా దరిద్రంగా అవమానకరంగా ఉంది. ఎందుకంటే ఇంతమంది బాలికలు చదువుతున్న కస్తూర్బా గాంధీ స్కూల్లో కేవలం నాలుగు గదులు అంటే ఎంతటి నీచమైన స్థితిలో ఉన్నాము ఒకసారి అర్థం చేసుకోవచ్చు. ఈ బాలికలకు 20 గదులు టాయిలెట్లు స్నానపు గదులు ఉండాలి కానీ ఇక్కడ అందుకు భిన్నంగా ఉన్నది. బాలికల తల్లిదండ్రులు చాలా బాధపడుతూ విచారంగా వ్యక్తం చేయడం జరిగింది. ఇంతమంది విద్యార్థులకు గదులు స్నానము గదులు కట్టించాలని అన్నారు.
స్కూలు పైనే టాయిలెట్ గదులు కట్టినారని అవి ఇంకా పూర్తి చేయలేదని మధ్యలోనే ఆపివేసినారని తక్షణమే సంబంధిత కాంట్రాక్టర్ తో అధికారులు మాట్లాడి బాలికలు ఎదుర్కొంటున్న సమస్యల పైన స్పందించి టాయిలెట్ గదులు కట్టించాలని అన్నారు. మరియు పాత రాజోలి వసతి గృహంలో ఉంటున్న విద్యార్థుల కాంపౌండ్ దగ్గర ఆస్తులు చుట్టూ నీవాసముఉన్నటువంటి కుటుంబాలు చెత్త చెదారము వ్యర్థ పదార్థాలు తెచ్చి హాస్టల్ ముందు ఉన్న కాంపౌండ్ దగ్గర వ్యర్థ పదార్థాలు చెత్తాచెదారంవేస్తున్నారని వీటివల్ల దోమలు చేరి విద్యార్థులకు పుట్టి మలేరియా టైఫాయిడ్ డెంగ్యూ జ్వరాలు వచ్చే ప్రమాదం ఉన్నదని అన్నారు. తక్షణమే ఆ చెత్త చెదారం తీసివేసి విద్యార్థుల ఆరోగ్యాలు కాపాడాలని లేనియెడల జిల్లాల కలెక్టర్ గారికి ఫిర్యాదు చేస్తామని కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు విజయ్ కుమార్ అన్నారుఈ కార్యక్రమంలో గోపాల్ రెడ్డి మహేశ్వర్ రెడ్డి కోడిగుడ్ల బషీర్ ఖాన్ కెవిపిఎస్ కార్యకర్తలు బాలికల బంధువులు పాల్గొన్నారుపాల్గొన్నారు.



