Monday, July 27, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఆరుతడి విత్తనాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి 

ఆరుతడి విత్తనాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి 

- Advertisement -

మండల వ్యవసాయ అధికారి భూక్య మహేందర్ 
నవతెలంగాణ-నెల్లికుదురు

ప్రస్తుతం ఎల్డినో ప్రభావం, వర్షాభావ పరిస్థితులు తక్కువ నీటితో సాగు చేయడానికి అనుకూలమైన ఆరుతడి పంటల విత్తనాలు రైతులు సద్వినియోగం చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి భూక్య మహేందర్ అన్నారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో విత్తనమేల కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో 27-07-2026 నుండి 29-07-2026 వరకు నెల్లికుదురు రైతు వేదికలో విత్తన మేళా నిర్వహించబడుతుంది. ప్రస్తుతం ఎల్‌నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో తక్కువ నీటితో సాగు చేయడానికి అనుకూలమైన ఆరుతడి పంటల విత్తనాలు రైతు వేదికలో రైతులకు అందుబాటులో ఉన్నాయని రైతులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.
అందుబాటులో ఉన్న విత్తనాలు: పెసర, కంది, మినుము కూరగాయలు, మొక్కజొన్న రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని విత్తనాలను పొందడంతో పాటు, పంటల ఎంపిక, సాగు యాజమాన్యం, వర్షాభావ పరిస్థితుల్లో అనుసరించాల్సిన శాస్త్రీయ సూచనలపై వ్యవసాయ శాఖ అధికారుల నుంచి అవగాహన పొందవలసింది ఎంతైనా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో నెల్లికుదురు ఉపసర్పంచ్ మంచాల వెంకన్న , మండల ఉద్యానశాఖ అధికారి స్రవంతి, ఏఈఓ లు సుమలత, మణికంఠ, ప్రతిభ, ధరణీశ్,  టీఎస్ ఆల్ ఫీల్డ్ ఆఫీసర్ నర్మద మరియు ఫెర్టిలైజర్ డీలర్స్, మండల రైతు సోదరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -